»   » అద్భుతమైన పాత్రలో శర్వానంద్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకే..

అద్భుతమైన పాత్రలో శర్వానంద్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sharwanand in jr.Ntr Role

టాలీవుడ్ యువహీరోలలో శర్వానంద్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు లాంటి హిట్లతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నాడు. ఇలా వరుసగా విజయాలు సొంతం చేసుకొంటూ వెళ్తున్న శర్వానంద్ ఓ అరుదైన పాత్రను పోషిస్తున్నట్టు వినికిడి. ఎన్టీఆర్ బయోపిక్‌లో శర్వానంద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే శర్వానంద్‌కు కెరీర్‌పరంగా అద్భుతమైన పాత్ర దక్కడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

 ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు

ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు

తెలుగువాడి సత్తాను విశ్వవాప్తం చేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే పనిలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు తేజ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న వార్తలు బయోపిక్‌పై అంచనాలు పెంచుతున్నాయి.

 ఎన్టీఆర్‌గా బాలయ్య

ఎన్టీఆర్‌గా బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్‌ టీ రామారావు పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నారు. ఈ మేరకు హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల పర్యవేక్షణలో కొంత వర్క్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తనున్నది.

యువ ఎన్టీఆర్‌గా శర్వానంద్

యువ ఎన్టీఆర్‌గా శర్వానంద్

టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందుతన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో యువ ఎన్టీఆర్ పాత్రకు శర్వానంద్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా పలువురు యువ హీరోల పేర్లు కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఎన్టీఆర్ జీవితంలో

ఎన్టీఆర్ జీవితంలో

యువ ఎన్టీఆర్ జీవితంలో కుస్తీ నేర్చుకోవడం, విద్యాభ్యాసం, నాటకరంగానికి సంబంధించిన ఘట్టాలు సినిమాలో అత్యంత కీలకంగా మారుతాయట. అలాంటి పాత్రను పోషించేందుకు ప్రతిభావంతుడైన యువ హీరో కోసం ఎదురుచూస్తున్నాం. ఆ పాత్ర ఎంపిక విషయంలో శర్వానంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పలువురు యువ హీరోల పేర్లు

పలువురు యువ హీరోల పేర్లు

కాగా, ఈ చిత్రంలో శర్వానంద్ మాత్రమే కాకుండా పలువురు యువహీరోలు కూడా నటించే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, ఇతర హీరోల పాత్రల కోసం పలువురు యువ హీరోలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తున్నది.

60 కోట్లతో బయోపిక్

60 కోట్లతో బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్‌ను సుమారు 60 కోట్ల వ్యయంతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారట. బాలయ్యకు సంక్రాంతి అంటే కలిసి వచ్చే పండుగ. తనకు ఎన్నో విజయాలను అందించిన సంక్రాంతి పండుగకే ఎన్టీఆర్ బయోపిక్ అందించాలనే దిశగా ఆయన నిర్ణయం తీసుకొన్నారట.

 శర్వా జన్మదినం సందర్భంగా

శర్వా జన్మదినం సందర్భంగా

శర్వానంద్ ప్రస్తుతం పడిపడి లేచే మనసు అనే చిత్రంలో నటిస్తున్నాడు. మార్చి 6న జన్మదినాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శర్వా సరసన సాయి పల్లవి నటిస్తున్నారు.

English summary
Young hero Sharwanand will be essaying the role of young NTR in the much-hyped biopic of legendary actor Nandamuri Taraka Ramarao. Sharwanand is one of the contenders for the role. Balakrishna is roped in to play Late Nandamuri Taraka Rama Rao (his father) in the upcoming biopic. Teja is directing the biopic which will depict the real-life incidents of Nandamuri Taraka Rama Roa's political journey and other things.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu