twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌లో వర్మ వెన్నుపోటు పొడుస్తాడా? బాలకృష్ణ మాతో పెట్టుకోకు..

    మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నానని దర్శకుడు వర్మ ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    By Rajababu
    |

    మీడియాను వాడుకోవడం ఎలా అనే విషయం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో సంచలనం రేపుతూ మీడియాలో పబ్లిసిటీని క్యాష్ చేసుకోవడం ఆర్జీవి అందరి కంటే ముందుంటాడు. గత కొన్నేళ్లుగా హిట్లు లేక ముఖం వాచిపోయిన వర్మకు మాత్రం పబ్లిసిటీ కోసం మీడియాను తెగవాడేసుకుంటున్నాడు. తాజాగా మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నానని ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మసక బారుతున్న ప్రతిష్ఠకు వెలుగు తెచ్చుకోవడానికే ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరమీదకు తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బయోపిక్ గురించి మాట్లాడుతూ..

    శత్రువులెవరు? నమ్మకద్రోహులెవరు?

    శత్రువులెవరు? నమ్మకద్రోహులెవరు?

    ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్‌లో నేల ఈనిననట్టు వచ్చిన లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్‌గా తెరకెక్కించడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని అన్నారు. అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన శత్రువులెవరు? నమ్మకద్రోహులెవరు? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ‘ఎన్టీఆర్' చిత్రంలో చూస్తారు అని అన్నారు.

    పొగడరా నా తండ్రి ఎన్టీఆర్‌ను

    పొగడరా నా తండ్రి ఎన్టీఆర్‌ను

    ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు గారు అంటే.. నేను ఒక సినీ దర్శకుడి హోదాలో కాకుండా 8 కోట్ల తెలుగువాళ్లలో కేవలం ఒక్కడిగా ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని.. పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్‌ని' అని వర్మ అంటానన్నారు.

    ఆడియో క్లిప్ విడుదల

    ఆడియో క్లిప్ విడుదల

    ఈ మేరకు ఏ దేశమేగినా అంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన వాయిస్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ‘జై ఎన్టీఆర్..' అంటూ తానే రాసి పాడిన పాటను కూడా వర్మ రిలీజ్ చేశారు. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ ఎన్టీఆర్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు.

    ఎన్టీఆర్ బయోపిక్ ఆషామాషీ కాదు..

    ఎన్టీఆర్ బయోపిక్ ఆషామాషీ కాదు..

    ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందరో మనోభావాలకు సంబంధించిన విషయం. మహానటుడు తీసుకొన్న అనూహ్యమైన నిర్ణయాలు, పార్టీని ధైర్యంగా నడిపించిన తీరును ఎలాంటి తడబాటుకు గురికాకుండా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్‌ జీవితాన్ని వెండితెర మీద సంపూర్ణంగా ఆవిష్కరించకపోతే బాక్సాఫీస్ వద్ద మరో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.

    వాళ్లంతా ఒక్క జిల్లా వారే..

    వాళ్లంతా ఒక్క జిల్లా వారే..

    ఇప్పటివరకు రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర పేరుతో పరిటాల రవి జీవిత కథను, వంగవీటి పేరుతో వంగవీటి మోహన రంగా, దేవినేని కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ చరిత్రను తెరకెక్కించాడు. వీరంతా కేవలం ఓ జిల్లాను ప్రభావితం చేసిన వ్యక్తులే. కానీ వర్మ ఇప్పుడు చేస్తున్నది ఓ సాహసమే. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడమనేది ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల ఆత్మభిమానానికి సంబంధించిన విషయం. తెలుగు ప్రపంచానికి చెందిన అంశం. చిత్ర నిర్మాణంలో ఒక్క అడుగు తేడా పడిందో వర్మకు ఊహించని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    వివాదమంతా లక్ష్మీపార్వతితోనే..

    వివాదమంతా లక్ష్మీపార్వతితోనే..

    ఎన్టీఆర్ జీవిత కథలో అత్యంత వివాదాస్పదమైన అంశం లక్ష్మీ పార్వతితో వివాహం. అక్కడ నుంచే పార్టీలో ముసలం పుటింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసిన అనూహ్యమైన నిర్ణయం. ఆ అంశమే ఎన్టీఆర్ మరణం అంచుకు తీసుకెళ్లిన దారుణ సంఘటన. ఈ విషయంలో ఎవరీ వాదన వారిదే. స్వయంగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి అండగా నిలిచారు. అధికారాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు.

    వెన్నుపోటు అంశం ఉంటుందా?

    వెన్నుపోటు అంశం ఉంటుందా?

    ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఊహించిన ఘటన తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు. పార్టీ ఎమ్మెల్యేలందరూ వెన్నుపోటు పొడిశారని ఎన్టీఆరే ఆరోపించారు. కానీ పార్టీని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం కారణంగా ప్రభుత్వ మార్పిడి జరిగిందని మరో వాదన. ఈ అంశం చాలా క్లిష్టమైనదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొంటారు.

    చైతన్యరథంపై చెప్పుల దాడి..

    చైతన్యరథంపై చెప్పుల దాడి..

    ఇక ఎన్టీఆర్, చంద్రబాబు వర్గాల మధ్య పార్టీలో విభేదాలు నెలకొనడం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ చివర్లో ఉన్న వైస్రాయి హోటల్లో ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు నడిచాయి. ఆ సందర్భంగా చైతన్య రథంపై వెళ్లిన ఎన్టీఆర్‌పై చంద్రబాబు వర్గం చెప్పులతో దాడి చేశారు. అదే సమయంలో బాలకృష్ణ నటించిన మాతో పెట్టుకోకు సినిమా రిలీజైంది. ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడమే కాకుండా ఆయనకు మాతో పెట్టుకోకు అనే పోస్టర్లను ప్రదర్శించారు.

    అనేక ప్రశ్నలకు సమాధానిమిస్తారా?

    అనేక ప్రశ్నలకు సమాధానిమిస్తారా?

    ఈ ఘటనను ఏ విధంగా వర్మ చూపిస్తాడు అనేది మరో ప్రశ్న. ఇలాంటి అంశాలను వర్మ ఎలా సృశిస్తాడు. ఎలా ఆవిష్కరిస్తాడు? ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులను ఎలా సంతృప్తి పరుస్తాడు అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇలా వందల ప్రశ్నలకు వర్మ సమాధానం ఎలా ఇస్తాడో వేచి చూడాల్సిందే.

    English summary
    The biopic on the late Chief Minister and legendary actor N.T. Rama Rao is in the news again. While actor Balakrishna had announced that he would be playing his father in the latter’s biopic, it is now being reported that Ram Gopal Varma will direct this film. Recently Varma released a audio clip on the biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X