»   » ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులు వివరాలు

ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులు వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డులను మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకుగాను అవార్డు గ్రహీతల వివరాలను సినీనటులు బాలకృష్ణ, మురళీ మోహన్‌ ప్రకటించారు.

రాష్ట్రాలు రెండుగా మారినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కటే అని అందుకే ఇరు రాష్ట్రాలకు చెందిన చలన చిత్ర ప్రముఖులనూ ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, ఎం.మురళీమోహన తెలిపారు.

అవార్డులు

అవార్డులు

ఎన్టీఆర్ అవార్డుకు 5 లక్షల నగదు పారితోషికం, ఇతర అవార్డులకు 2 లక్షల నగదు పారితోషికం, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. ఏపీ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులను ప్రవేశపెట్టి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా రెండురోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణోత్సవాలను నిర్వహించి అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.

ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ 2012

ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ 2012

ఎన్టీఆర్‌ జాతీయ‌ చలనచిత్ర అవార్డు 2012 సంవత్సరానికి గాను ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసారు.

ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ 2012

ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ 2012

ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు 2013 సంవత్సారినికి గాను ప్రముఖ నటి హేమమాలిని ఎంపిక చేసారు.

బీఎన్‌రెడ్డి అవార్డు 2012

బీఎన్‌రెడ్డి అవార్డు 2012

బీఎన్‌రెడ్డి అవార్డు 2012 సంవత్సరానికి గాను ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎంపికయ్యారు.

బీఎన్‌రెడ్డి అవార్డు 2013

బీఎన్‌రెడ్డి అవార్డు 2013

బీఎన్‌రెడ్డి అవార్డు 2013 సంవత్సరానికి గాను ప్రముఖ తెలుగు దర్శకుడు కోదండ రామిరెడ్డి ఎంపికయ్యారు.

రఘుపతి వెంకయ్య అవార్డు 2012

రఘుపతి వెంకయ్య అవార్డు 2012

రఘుపతి వెంకయ్య అవార్డు 2012- సంవత్సరానికి గాను ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ ఎంపికయ్యారు.

రఘుపతి వెంకయ్య అవార్డు 2013

రఘుపతి వెంకయ్య అవార్డు 2013

రఘుపతి వెంకయ్య అవార్డు 2013 సంవత్సారనికి గాను ప్రముఖ సీనియర్ నటి వాణిశ్రీ ని ఎంపిక చేసారు.

నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012

నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012

నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012 సంవత్సరానికి ప్రముఖ తెలుగు నిర్మాత డి.సురేశ్‌బాబును ఎంపిక చేసారు.

నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012

నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012

నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2013 సంవత్సరానికి గాను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజును ఎంపిక చేసారు.

English summary
NTR, BN Reddy, Nagireddy, Chakrapani National film award & Raghupathi Venkaiah award announced for 2012 & 2013 year​.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu