»   » ఎన్టీఆర్ ది ఈ నెల 18 న ఒకటి, 28 న మరొకటి

ఎన్టీఆర్ ది ఈ నెల 18 న ఒకటి, 28 న మరొకటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింహా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం పిభ్రవరి 18 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రం పిబ్రవరి 28 న షూటింగ్ మొదలు కానుంది. దాంతో పదిరోజుల తేడాలో రెండు చిత్రాలు ప్రారంభం కానుండటంతో ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరోప్రక్క మెహర్ రమేష్ తో చేస్తున్న శక్తి చిత్రం పూర్తి కావొచ్చిది. ఇక సురేంద్ర రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని ఎంపిక చేసారు. ఇప్పటికి మూడు పాటలు రికార్డింగ్ పూర్తయ్యింది. షూటింగ్ కి వెళ్ళేలోగా మిగతా రెండు పాటలు రికార్డింగ్ పూర్తి చేస్తారు. ఇక రెండు చిత్రాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ కావటం మరో విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu