»   » పద్మాలయా స్టూడియోలో జూ ఎన్టీఆర్ కి ఏం పని?

పద్మాలయా స్టూడియోలో జూ ఎన్టీఆర్ కి ఏం పని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మాలయా స్టూడియోలో జూ.ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) కోసం పాటల షూటింగ్ లో పాల్గొంటున్నారు. సమంత, కాజల్ కాంబినేషన్ లో ఓ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్ లో సోమవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ పాటలో కొంత భాగం పూర్తి చేసుకుని తర్వాత అన్నపూర్ణలో వేసిన మరో గ్రాండ్ సెట్ లోకి మారి మిగతా పాటని చిత్రీకరిస్తారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్సకత్వంలో రూపొందే ఈ పాట చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. కెమెరా ఛోటా కె.నాయుడు, సంగీతం ఎస్.ధామస్, పైట్స్ పీటర్ హెయిన్స్ ఈ చిత్రానికి సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్‌రాజ్, ముఖేష్‌రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu