»   » బాధ్యతగల పౌరుడిని.. చట్టాలంటే గౌరవం ఉంది.. సేవాపన్నుపై ఎన్టీఆర్

బాధ్యతగల పౌరుడిని.. చట్టాలంటే గౌరవం ఉంది.. సేవాపన్నుపై ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్నకు ప్రేమతో షూటింగ్ సందర్భంగా సేవా పన్ను చెల్లించలేదనే ఆరోపణలతో అందిన కాగ్ నోటీసులపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. వినోద రంగంలో సేవా పన్ను చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ నివేదికను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవా పన్ను చెల్లించలేదంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు, రణ్‌బీర్ కపూర్ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

సర్వీస్ ట్యాక్స్ ఎగవేతపై

సర్వీస్ ట్యాక్స్ ఎగవేతపై

టాలీవుడ్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్‌ లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని కాగ్‌ ఆ నివేదికలో పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద పరిగణించి తాను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరిస్తూ జూనియర్ ఎన్టీఆర్‌కు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నోటీసులపై స్పందించారు.

వివరాలు వెల్లడించడం బాధ్యత

వివరాలు వెల్లడించడం బాధ్యత

పలు దినపత్రికల్లో వచ్చిన సర్వీస్ టాక్స్ మినహాయింపు కథనంపై బాధ్యతాయుత పౌరుడిగా స్పందన తెలియజేయటం సబబు అని భావించాను. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం భావ్యమని భావిస్తున్నా.

మా ఆడిటర్లు స్పందించారు..

మా ఆడిటర్లు స్పందించారు..

నాన్నకు ప్రేమతో చిత్రం లండన్‌లో రూపొందించడం జరిగింది. విదేశాల్లో అందించిన సేవలకు స్వదేశంలో సర్వీస్ టాక్స్ నిబంధనలు వర్తించవు అని చెప్పారు. దాంతో నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాతల వద్ద సర్వీస్ టాక్స్ వసూలు చేయలేదు. 2016 లో ఇదే విషయంపై కాగ్ నుంచి వచ్చిన నోటీసులకు లిఖితపూర్వకంగా మా ఆడిటర్ స్పందించారు. ఆ స్పందన తర్వాత ఎలాంటి అధికారిక ఉత్తర్వులు గానీ, నోటీసులు గానీ అందలేదు

క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను..

క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను..

చాలా సంవత్సరాలుగా ఆదాయపు పన్ను, సేవా పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. బాధ్యాయుత పౌరుడిగా నా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మరువలేదు. ఈ విషయంలో సంబంధిత అధికారుల నుంచి నాకు ఆదేశాలు అందితే అందుకు స్పందిస్తాను. నా వైపు నుంచి నేను చట్టపరంగా చెల్లించాల్సిన రుసుము ఏమైనా ఉంటే, అణా పైసలతో సహా చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. చట్టమంటే నాకు ఎనలేని గౌరవం ఉంది అని ఎన్టీఆర్ తెలిపారు.

English summary
Actor Junior NTR clarifies non payment of Service tax for the feature film "Nannaku Prematho", which was produced in England (London) , I hereby release this press release to present the correct facts. I have acted in the above film in 2015 which was made in the UK by the producer. I was advised by legal and tax experts that any Service(in this case as an actor) rendered outside India for which payment is received in Foreign Exchange , is not taxable for Service tax in India . Accordingly, I have not collected the service tax from the producer of "Nannaku Prematho".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu