»   »  తల నరికారు: జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రూరత్వం (వీడియో)

తల నరికారు: జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రూరత్వం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే అభిమానులు భారీ హోర్డింగులు పెట్టడం, నానా హంగామా చేయడం మామూలే. అయితే ఇటీవల నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్భంగా జూ ఎన్టీఆర్ అభిమానులు క్రూరంగా ప్రవర్తించారు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' పోస్టర్ ముందు అత్యంత క్రూరంగా గొర్రె తలను నరికారు. ఆ రక్తాన్ని పోస్టర్ మీద చల్లారు.

అందుకు సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పులివెందులలోని లక్ష్మి సినిమా హాల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యను అత్యంత పాశవిక చర్యగా, ఆటవిక చర్యగా పలువురు పేర్కొంటున్నారు. ఈ చర్యపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఘటనపై లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Junior NTR fans slaughter lamb during film release in Kadapa

Viewer discretion advised.

Posted by TheNewsMinute on Sunday, 17 January 2016

నాన్నకు ప్రేమతో వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి పండగ, వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. అయితే సోమ, మంగళ వారాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా ఉండటం విశేషం. యూఎస్ఏలో ఎన్టీఆర్ కెరీర్లో 1 మిలియన్ మార్కను అందుకున్న 3వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'.

 NTR fans slaughtering a lamb

ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కు దాటలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో పాటు, రూ. 50 కోట్ల మార్కు దాటుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
A video clipping of Junior NTR fans slaughtering a lamb during the release of his latest movie Nannaku Prematho on Wednesday is doing rounds on the internet.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu