twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నగారి ఇంటిని అమ్మేస్తున్నారు: అమ్మకానికి ఎన్టీఆర్ ఇల్లు, మనస్తాపం లో అభిమానులు

    చెన్నై, టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28 నివాసం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న ‘ఇల్లు అమ్మబడును’ బోర్డును చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెందుతున్నారు.

    |

    ఒకనాటి తెలుగు లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకు మించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రీ అయిన ఎన్టీఆర్ ఇల్లు ఈరోజు అప్పటి వైభవాన్ని కోల్పోయి అమ్మకానికి సిద్దంగా ఉంది. అప్పటి సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నై నగరం లోనే ఉన్నందు వల్ల మన సీనియర్ హీరోలందరికీ ఆ నగరం తో విడదీయరాని అనుబందం ఉంది.

    ఆనాటి మద్రాసు

    ఆనాటి మద్రాసు

    నటుడు బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు లాటి అగ్రహీరోలంతా వాళ్ళ బాల్యం చెన్నై అని పిలవబడే ఆనాటి మద్రాసులోనే గడిచింది. అలా మన హీరోలకి అక్కడ సొంత భవనాలు ఉన్నాయి. అలాంటిదే ఒకనాటి స్టార్ నటుడు అయిన ఎన్టీఆర్ ఇల్లు కూడా.

     ఇల్లు అమ్మబడును

    ఇల్లు అమ్మబడును

    చెన్నై, టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28 ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక. ఆ నివాసం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న ‘ఇల్లు అమ్మబడును' బోర్డును చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెందుతున్నారు.

    ఎన్టీఆర్ వీధి

    ఎన్టీఆర్ వీధి

    గేటుకు వేలాడుతున్న బోర్డులో బ్రోకర్ ఏలుమలై అనే పేరు, సెల్‌ఫోన్ నంబరు ఉన్నాయి. నటుడిగా ఎన్టీఆర్ కాస్త స్థిరపడిన తర్వాత ముందుగా చెన్నై, రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో ఆ వీధి కాస్తా ఎన్టీఆర్ వీధిగా మారింది.

    బజుల్లా రోడ్డులోని 28వ నెంబర్ ఇల్లు

    బజుల్లా రోడ్డులోని 28వ నెంబర్ ఇల్లు

    కొన్నాళ్లకు అలనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావుకు చెందిన బజుల్లా రోడ్డులోని 28వ నెంబర్ ఇల్లు అమ్మకానికి రావడంతో ఎన్టీఆర్ దానిని కొనుగోలు చేశారు. 1953లో కొనుగోలు చేసిన ఈ ఇంటికి కొన్ని మరమ్మతులు చేసి తన అభిరుచికి అనుగుణంగా ఇంట్లోనే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

    ముందుగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి

    ముందుగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి

    అప్పట్లో తిరుపతికి వచ్చిన తెలుగు వారంతా మద్రాసు ప్రయాణం కూడా పెట్టుకుని, ముందుగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి, ఆయనని చూసి తమ జన్మ ధన్యమైందన్నట్టుగా సంతృప్తి చెంది వెళ్లేవారు.కాగా, ఎన్టీఆర్ ఈ కొత్త ఇంటికి మారగానే రంగరాజపురంలోని ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు.

    కళావిహీనంగా మారింది

    కళావిహీనంగా మారింది

    ఆ తర్వాత ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాదుకి వచ్చేయడంతో ఇప్పుడు బజుల్లా రోడ్డులోని ఆ ఇల్లు ఆలనా పాలనా లేక కళావిహీనంగా మారింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఇంటి బయట ఇప్పుడు వేలాడుతున్న 'ఇల్లు అమ్మబడును' అనే ఆ బోర్డు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

    English summary
    NTR used to live in Chennai’s T-Nagar in Bajulla road. He named his house as Nandamuri House also known as NTR estate. He resided there for about twenty years 1960-1980.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X