అలా అయితే ఎన్టీఆర్ కి ప్లాబ్లముండదా?

అయితే సినిమాలకు సంభందించిన ప్రతీ విషయం తన జక్కన్న (ఎస్.ఎస్.రాజమౌళి) కి చెప్పి ఫైనల్ డెషిషన్ తీసుకునే అలవాటు ఉన్న ఎన్టీఆర్ ఆ ప్రపోజల్ అతని ముందు పెట్టాడు. దానికి రాజమౌళి నొ చెప్పాడని చెప్పుకుంటున్నారు. మాస్ హీరోగా నిలదొక్కుకుని ఎదుగుతున్న ఈ సమయంలో ఇటువంటి ప్రయోగాలు అనవసరమని నచ్చచెప్పాడని తెలుస్తోంది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మొదట ఈ పౌరాణిక గెటప్స్ లో పాటల్లో కనిపించి ప్రేక్షకులకు అలవాటు చేసి తర్వాత పూర్తి స్ధాయి పాత్రలో కనపడినా ఇబ్బంది ఉండదని చెప్పారని అంటున్నారు.
దాంతో ఆయన సూచనలు తర్వాత వచ్చే సినిమాల్లో అమలు పరిచే అవకాశముందని ఇండస్ట్రీ టాక్ . అలా అయితే ఎన్టీఆర్ కి ప్లాబ్లమేమీ ఉండదని విశ్లేషకులు కూడా చరిత్ర తిరగేసి మరీ చెప్పారుట. ఎన్టీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటే తిరుగేముంది...అతని అభిమానులకు త్వరోలో వివిధ గెటప్స్ విందు జరుగుతుందన్నమాట.


Click it and Unblock the Notifications











