»   » ఐపీఎల్ 2018 కోసం రంగంలోకి ఎన్టీఆర్, ఇక రచ్చ రచ్చే!

ఐపీఎల్ 2018 కోసం రంగంలోకి ఎన్టీఆర్, ఇక రచ్చ రచ్చే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
IPL 2018 Is Going To Get Launched By Junior Ntr

'స్టార్ మా'లో గతేడాది ప్రసారం అయిన 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో తొలి సీజన్‌ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఈ షో సూపర్ సక్సెస్ అవ్వడంలో ప్రధాన భూమిక పోషించారు. 'మా' టీవీని సొంతం చేసుకుని తెలుగులో కొత్తగా ప్రయాణం ప్రారంభించిన స్టార్ నెట్వర్క్‌కు ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ మంచి బూస్ట్ ఇచ్చింది.

త్వరలో ప్రారంభం అయ్యే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 2 కూడా యంగ్ టైగర్‌తోనే హోస్ట్ చేయించాలని స్టార్ నెట్వర్క్ యాజమాన్యం భావించినా.... తన వరుస సినిమా కమిట్మెంట్ల వల్ల నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇపుడు స్టార్ నెట్వర్క్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను మరో రకంగా వాడుకోవడానికి సిద్ధమయ్యారట.

ఐపీఎల్ ప్రమోషన్స్ కోసం

ఐపీఎల్ ప్రమోషన్స్ కోసం

ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ నెట్వర్క్.... ఈ టోర్నీని తన నెట్వర్క్ విస్తరించి ఉన్న అన్ని భాషల్లో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుగులో ఐపీఎల్‌ 2018ని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌ను వాడుకోనున్నారు.

ఓకే చెప్పిన ఎన్టీఆర్

ఓకే చెప్పిన ఎన్టీఆర్

ఇటీవలే ఎన్టీఆర్‌ను స్టార్ నెట్వర్క్ ప్రతినిధులు కలిసి ఈ విషయమై మాట్లాడారు. ఐపీఎల్ 2018ని ప్రమోట్ చేస్తూ యాడ్స్‌లో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోమోలు విడుదల కానున్నాయి.

ఐపీఎల్ కోసం భారీ ఖర్చు

ఐపీఎల్ కోసం భారీ ఖర్చు

ఐపీఎల్ 2018ని గతేడాది కంటే భారీ హిట్ చేసేందుకు నిర్వాహకులు గ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో 15 నిమిషాలు డాన్స్ చేసేందుకు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారంటే.... ఖర్చు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ సినిమా కమిట్మెంట్స్

ఎన్టీఆర్ సినిమా కమిట్మెంట్స్

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిటై అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీ అయ్యారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే షూటింగులో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్ ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు.

English summary
Latest reports suggest that Telugu star Junior NTR aka Tarak has been approached by the Star Network to promote this season of the IPL in a grand manner and it is said that he will be doing a few commercials and promo videos for the same. Ranveer Singh has already agreed to perform at the opening ceremony of this year’s IPL.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X