»   » జూ ఎన్టీఆర్‌కి యాక్సిడెంటని ఫ్యాన్స్ కంగారు...నిర్మాతల వివరణ!

జూ ఎన్టీఆర్‌కి యాక్సిడెంటని ఫ్యాన్స్ కంగారు...నిర్మాతల వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే ఉన్నట్టుండి ట్విట్టర్లో ఓ షాకింగ్ న్యూస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు.

జనతా గ్యారేజ్ సినిమా పేరుతో ఉన్న అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిందనే విషయం పోస్టయింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగరు పడ్డారు. ఈ విషయ ఫ్యాన్ సర్కిల్ లో దావానలంలా వ్యాపించడంతో నిజా నిజాలు కనుక్కునే ప్రయత్నం చేసారు. ఈలోగా జనతాగ్యారేజ్ అఫీషియల్ ట్విట్టర్ పేజీ బ్లాక్ అయిపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ కంగారు పడ్డారు.

Also Read: చావుకు భయ పడను: జూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

విషయం జూ ఎన్టీఆర్ పిఆర్ మహేష్ ఎస్ కోనేరు, నిర్మాతల దృష్టికి రావడంతో వెంటనే వివరణ ఇచ్చారు. 'జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా @MythriOfficial పేజీ ద్వారానే వస్తాయి. జనతాగ్యారేజ్ పేరుతో ఎటువంటి అఫీషియల్ పేజీ లేదు. రూమర్స్ నమ్మొద్దు. తారక్ కు ఏమీ కాలేదు' అని మహేష్ ఎస్ కోనేరు ట్విట్టర్ ద్వారా విరవణ ఇచ్చారు.

మరో వైపు నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ వారు కూడా ట్విట్టర్ ద్వారా విరవణ ఇచ్చారు. 'ఎన్టీఆర్ 26వ సినిమా(జనతా గ్యారేజ్ అనేది వర్కింగ్ టైటిల్) గురించిన ఏ విషయం అయినా @MythriOfficial ద్వారానే ప్రకటింస్తాం. దయచేసి ఫేక్ అకౌంట్స్ ను, రూమర్స్ నమ్మవద్దు అని ట్వీట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

మహేష్ ఎస్ కోనేరు ట్వీట్

తారక్ కు సంబంధించిన మర్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ చూసుకుంటున్న మహేష్ ఎస్ కోనేరు చేసిన ట్వీట్ ఇది...

మైత్రి మూవీ మేకర్స్ వారి ట్వీట్

యచేసి ఫేక్ అకౌంట్స్ ను, రూమర్స్ నమ్మవద్దు అని ట్వీట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ వారు...

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్ సినిమా ప్రారంభోత్సవం నాటి దృశ్యం.

కొరటాల

కొరటాల

ఈ చిత్రానికి అంతా టాప్ టెక్నీషియన్లే పని చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకటైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమా ఎడిటింగ్ విభాగంలో ప్రముఖుడై కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. దీంతో పాటు క్రిష్-3 లాంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

భారీ సెట్

భారీ సెట్

ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేసారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో సెట్ వేసారు.

ఇంకా..

ఇంకా..

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.

English summary
"This MythriOfficial is the only official id for #JanathaGarage ..No other id's exist..don't believe rumours..Tarak is perfectly fine" Mahesh S Koneru said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu