»   » ఎన్టీఆర్ 'అదుర్స్' జర్కిన్, టోపి వేలం... వివరాలు

ఎన్టీఆర్ 'అదుర్స్' జర్కిన్, టోపి వేలం... వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివి వినాయిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చి, సంక్రాంతికి విడుదలై విజయవంతమైన చిత్రం అదుర్స్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేసుకున్న జర్కిన్, టోపీ ని ఇప్పుడు వేలానికి పెట్టారు. ఈ వేలాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. అలాగే ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును పేద కళాకారుల సహాయార్థం వినియోగిస్తారు. ఈ వేలానికి సంబంధించిన వివరాలను 'మా' అధికారిక వెబ్ సైట్ 'మాస్టార్ట్స్ డాట్ కామ్'లో పొందుపరచారు. ఇక ఆ ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ ఈ వేలానికి అనూహ్య స్పందన వచ్చిందనీ, అభిమానులు పోటీపడుతున్నారనీ తెలియచేసారు. ఇక జర్కిన్ ను వేలంపెట్టిన ఆరు గంటల్లోనే 50,000 రూపాయలు పలికిందనీ, హ్యాట్ కోసం కూడా గట్టి పోటీ ఉందనీ పేర్కొన్నారు. ఇక ఆసక్తి ఉన్న వారు ఈనెల 28 వరకూ బిడ్ వేయవచ్చునని, ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ సంప్రదించమని, ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా బిడ్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu