»   » ఎన్టీఆర్ టోపీ,జాకెట్ వేలంలో గెలుచుకున్నదెవరంటే...

ఎన్టీఆర్ టోపీ,జాకెట్ వేలంలో గెలుచుకున్నదెవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అదుర్స్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన జాకెట్ (కోటు), హ్యాట్ (టోపీ)లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. మూడు వారాలపాటు సాగిన ఈ ఆన్‌లైన్ వేలం మార్చి 28తో ముగిసింది. వేలం ద్వారా వచ్చే నిధులను నిస్సహాయులు, సినీ పరిశ్రమలోని అవసరార్థులకు వినియోగించనున్నారు. వేలంలో గెలిచిన వారికి జూనియర్ ఎన్టీఆర్ ఆ వస్తువులను స్వయంగా అందజేస్తారని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు వాటిని వేలం ద్వారా దక్కించుకున్నారు. ఒకవైపు సంఘసేవ చేయడంతోపాటు అభిమాన నటుడ్ని స్వయంగా కలవడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ పోర్టల్‌ను నడుపుతున్న అమెరికాలోని లాస్ ఏంజలెస్‌కు చెందిన ఎన్నారై మురళీ రవి జాకెట్ దక్కించుకోగా, హైదరాబాద్‌ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ హ్యాట్‌ను పొందారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu