»   » ఎన్టీఆర్ కోసం పని స్టార్టైంది..ఇదిగో సాక్ష్యం (ఫొటో)

ఎన్టీఆర్ కోసం పని స్టార్టైంది..ఇదిగో సాక్ష్యం (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :కొరటాల శివ, దేవీ శ్రీ ప్రసాద్ ఇద్దరు కలిసి మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు టాలీవుడ్ కు. మళ్ళీ అదే ఊపులో కొనసాగలని, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. దానికి సంబందించి దేవీ, తన ట్విట్టర్ ఖాతలో ఓ ఫోస్ట్ చేసారు ఫోటోతో కూడినది. దానిని మీరు ఇక్కడ చూడండి.

ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరక్టర్ లలో మంచి పాపులర్ అయిన వ్యక్తి దేవిశ్రీ. ఇప్పటికే ఎన్టీఆర్ కు అదుర్స్, రీసెంట్ గా నాన్నకు ప్రేమతో సినిమాలకు మంచి సంగీతం అందించి క్రేజిగా మారాడు. దీనితో ఈ రాబోయో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

మరో ప్రక్క...ఎన్టీఆర్ సైతం షాక్ అయ్యెలా ఈ సినిమా బిజినెస్ కూడా జరిగిపోవడం ఆశ్చర్యాన్ని కూడా రెకెత్తిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా, మెహన్ లాల్ ఓ కీ రోల్ లో నటించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ షూటింగ్ మెదలవుతుందని సమాచారం.

 NTR Janata Garage starts it's music session

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు అందుకున్నారు. మరో ప్రక్క దర్శక, నిర్మాతలు ఈ చిత్రానికి హీరోయిన్స్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ‘జనతా గ్యారేజీ' అనే వర్కింగ్ టైటిల్ రూపొందనున్న ఈ చిత్రంలో సమంతను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం.

అలాగే మరో హీరోయిన్ గా నిత్యామీనన్ ని ఎంపిక చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యామీనన్ ని కలిసి కథ చెప్పారని, ఆమె కూడా డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని ఎన్టీఆర్ తో చేయటానికి ఆసక్తి చూపించిందని సమాచారం.

మహేష్ తో ‘శ్రీమంతుడు' చిత్రాన్ని తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇందుకోసం ఆయన తెలుగు సైతం నేర్చుకుంటున్నారు.

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనుల తో పాటు స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. జనవరి చివర్లో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

English summary
Now the music sessions for Janata Garage have begun. "Excited 2 start composing once again with dear sivakoratala for tarak9999 #JANATHA GARAGE !! Rocking Script yo," Devi Sri Prasad tweeted in joy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu