»   » నందమూరి హీరోల మల్టీ స్టారర్..కసరత్తు మొదలైంది

నందమూరి హీరోల మల్టీ స్టారర్..కసరత్తు మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ్ముడు తారక్ తో కలిసి కళ్యాణ్ రామ్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అటు అభిమానులు కూడా ఆశ పడుతున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరు స్టార్ పలు సందర్భాల్లో స్పష్టం చేసారు కూడా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ప్రముఖ రచయిత వక్కతం వంశీ ఈ సినిమాకు స్క్రిప్టు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.

రియల్ లైఫ్ లో అన్నదమ్ములైన ఈ స్టార్స్.... తెరపై కూడా అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంతబేనర్ ఎన్టీఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ‘జనతా గ్యారేజ్' చిత్రానికి కమిటైన నేపథ్యంలో ఈ సినిమా తర్వాత నందమూరి మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది త్వరలోనే ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానకి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ‘జనతా గ్యారేజ్' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫిబ్రవరి 17న ఎన్టీఆర్ సెట్స్ లో జాయినవుతాడని అంటున్నారు.

NTR-Kalyan Ram multi-starrer details

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శకుడు పక్కా ప్రణాళిక సిద్ధం చేసాడని, ఈ మేరకు అంతా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అంతా టాప్ టెక్నీషియన్లే పని చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకటైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమా ఎడిటింగ్ విభాగంలో ప్రముఖుడై కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. దీంతో పాటు క్రిష్-3 లాంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.

English summary
Kalyan Ram was working on a script for a multi-starrer with Jr. NTR. According to the latest buzz, the Nandamuri duo will join hands with writer Vakkantham Vamsi for this multi-starrer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu