twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ హైదరాబాద్‌లో స్పెషల్ షోలు!

    |

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పండగ సమయం కావడం, ఈ చిత్రానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదనపు షోలు ప్రదర్శించడానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.

    జవవరి 9 నుంచి 16 వరకు ఏపీలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా 2 షోలకు అనుమతి లభించింది. దీంతో ఏపీలో ప్రతి రోజూ 6 షోలు ప్రదర్శింపబనున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పండగ సీజన్ కావడంతో అదనపు షోలు ఓపెనింగ్స్ పరంగా కలిసిరానున్నాయి.

     NTR Kathanayakudu AM shows in Hyderabad

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలో దాదాపు 1000 స్క్రీన్లలో ప్రదర్శింపబడనున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటం, అక్కడ తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో బాలయ్య బెంగుళూరు వెళ్లి ఈ సినిమాను ప్రమోట్ చేశారు.

    సౌత్ రాష్ట్రాల్లో కేరళలో మినహా అన్ని చోట్లా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నార్త్‌లో ముంబైతో పాటు కొన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌లో యూఎస్ఏలో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా గల్ప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, యూకె సైతం వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం తెలుగులో మాత్రమే విడుదలవుతోంది. తర్వాత ఇతర భారతీయ భాషల్లో అనువదించి చేసి విడుదల చేయబోతున్నారు.

    English summary
    Andhra Pradesh allowed NTR-Kathanayakudu six shows to be aired for all the big Sankranthi releases which will be releasing from tomorrow. The latest we hear is that there will be 7 AM shows in Hyderabad as well and the tickets for the same are being sold out on many ticketing Apps. According to sources close to the film, NTR-Kathanayakudu will be releasing in over 1,000 screens in Telangana, Andhra Pradesh and certain parts of Tamil Nadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X