twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి మొనగాడు బాలయ్యబాబే.. (ఎన్టీఆర్-కథానాయకుడు ఫ్యాన్స్, పబ్లిక్ టాక్)

    |

    Recommended Video

    NTR Kathanayakudu Public Talk ఎన్టీఆర్ కథానాయకుడు పబ్లిక్ టాక్ | Filmibeat Telugu

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రానికి ప్రేక్షకులు, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా తొలిరోజు కావడంతో థియేటర్లకు అభిమానులు పోటెత్తారు. విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

    సినిమా చూసిన అనంతరం ఫ్యాన్స్, ఆడియన్స్ పూర్తి సంతృప్తితో బయటకు రావడం కనిపించింది. బయోపిక్ తమను ఎంతగానో మెప్పించిందనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అన్నగారి తర్వాత మాకు బాలయ్య బాబే.. మరో హీరో దొరకడు.. జై బాలయ్య అంటూ థియేటర్ల వద్ద నినాదాలు మారుమ్రోగాయి.

    తండ్రి పాత్రలో బాలయ్య జీవించారు

    తండ్రి పాత్రలో బాలయ్య జీవించారు

    సినిమా అద్భుతంగా ఉంది. తండ్రి పాత్రలో బాలయ్య బాబు జీవించాడు. ఆయన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నందమూరి తారక రామారావును తెరపై చూస్తుంటే దేవుడే దిగొచ్చినట్లు ఉందనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అయ్యాయి.

    సంక్రాంతి మొనగాబు బాలయ్యబాబే..

    సంక్రాంతి మొనగాబు బాలయ్యబాబే..

    సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ... ఈసారి కూడా పండగ మొనగాడు బాలయ్యబాబే అని మరోసారి రుజువైంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప సినిమా చూశామనే సంతోషం ప్రతి ఒక్కరి మొహంలో కనిపించడం గమనార్హం.

    ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సినిమా

    ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సినిమా

    ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సినిమా ఇది. అన్నగారిని మా బాలయ్య బాబులో చూసుకుంటున్నాం. ఇలాంటి సినిమా బాలయ్య బాబుగారు మాత్రమే చేయగలరు. ఇంకెవరూ ఇలాంటి చిత్రం చేయలేరని మరికొందరు వ్యాఖ్యానించారు.

    క్రిష్ డైరెక్షన్, కీరవాణి సంగీతం సూపర్ అంటూ...

    తెరపై బాలయ్యను చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. అన్నగారిని మాకు మళ్లీ చూపించిన బాలయ్యబాబుకు థాంక్స్. సినిమాలో దివిసీమ ఎపిసోడ్ చూసి ఎమోషనల్‌గా ఫీలయ్యాం. మ్యూజిక్, క్లైమాక్స్ చాలా బావుంది. కీరవాణి వందశాతం న్యాయం చేశారు. క్రిష్ డైరెక్షన్ చాలా బావుందని తెలిపారు.

    English summary
    NTR Kathanayakudu Public Talk. N.T.R. Kathanayakudu is a 2019 Telugu, biographical film, based on the life of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha, Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, Vibri Media banners and directed by Krish. The film stars Nandamuri Balakrishna as his father N. T. Rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X