»   » ‘జై లవ కుశ’ చూశా, రాత్రి నిద్రపట్టలేదు: బండ్ల గణేష్

‘జై లవ కుశ’ చూశా, రాత్రి నిద్రపట్టలేదు: బండ్ల గణేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమాపై బండ్ల గణేష్ స్పందించారు. సినిమా చూసిన అనంతరం తన మనసులోని అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్......,ఎన్.వి.ఆర్ ...,తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూ ఎన్టీఆర్ ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు. అయితే పైన ఒక చిన్న మిస్టేక్ ఉన్నంది. బహుషా బండ్ల గణేష్ ఎస్.వి.ఆర్ అనబోయి ఎన్.వి.ఆర్ అని తప్పుగా రాసినట్లు స్పష్టం అవుతోంది.

Jai Lava Kusa collectons dropped because Bigg Boss జై లవకుశ కలెక్షన్లపై బిగ్‌బాస్ దెబ్బ !
బండ్ల గణేష్ ట్వీట్

బండ్ల గణేష్ ట్వీట్

ఎన్టీఆర్ సినిమా, ఆయన నటనను పొగుడుతూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌‌ను ఎన్టీఆర్ అభిమానులు రీట్వీట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం

ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం

బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు. అయితే ఎన్టీఆర్ అంటే కూడా గణేష్‌కు చాలా ఇష్టం. ఆయన తొలిసారిగా బండ్ల గణేష్ ‘బాద్ షా' చిత్రం చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

టెంపర్

టెంపర్

‘బాద్‌షా' చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ చేసిన మరో సినిమా ‘టెంపర్'. పూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలై మంచి విజయం సాధించింది.

సినిమాలకు దూరమైనా...

సినిమాలకు దూరమైనా...

కారణం ఏమిటో తెలియదు కానీ... రెండేళ్లుగా బండ్ల గణేష్ సినిమాలు చేయడం లేదు. ఆర్థిక పరమైన ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్ అందరికీ టచ్ లోనే ఉంటున్నారు.

English summary
"NTR kills performance superb in Jai Lava Kusa" Bandla Ganesh said. Jai Lava Kusa is a 2017 Telugu-language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu