లేట్ నైట్ పార్టీ: వైఫ్‌తో ఎన్టీఆర్, బన్నీ భార్య, నారా రోహిత్ కూడా.... (ఫోటోస్)
ఎన్టీఆర్ తాజాగా ఓ లేట్ నైట్ పార్టీకి భార్యతో కలిసి హాజరయ్యారు. ఎన్టీఆర్ దంపతులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు.
హైదరాబాద్: తనకు అత్యంత సన్నిహితులైతే తప్ప పార్టీలు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాని ఎన్టీఆర్ తాజాగా ఓ లేట్ నైట్ పార్టీకి భార్యతో కలిసి హాజరయ్యారు. ఎన్టీఆర్ దంపతులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు.
ప్రముఖ తెలుగు నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి కూతురు కీర్తి బర్త్ డే సందర్భంగా ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఎన్టీఆర్ దంపతులు, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నారా రోహిత్, ప్రగ్యా జైస్వాల్, అశ్వినీదత్ కూతురు ప్రయాంక దత్, స్వప్నదత్, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి తదితరులు హాజరయ్యారు.

చాలా కాలం తర్వాత
ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్ చాలా కాలం తర్వాత ఇలాంటి పార్టీలో పాల్గొన్నారు. భార్య లక్ష్మి ప్రణతి, మరికొంతమంది స్నేహితులతో కలిసి పార్టీలో బాగా ఎంజాయ్ చేశారు.

నారా రోహిత్
ఈ పార్టీలో నందమూరి ఫ్యామిలీకి బంధువు, తెలుగు హీరో నారా రోహిత్ కూడా జాయిన్ కావడం విశేషం. పార్టీలో సందడి చేసిన వీరు సెల్ఫీ ఫోటోలు దిగుతూ సందడి చేసారు.

హ్యాపీ మూమెంట్స్
తమ హ్యాపీ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఈ లేట్ నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలను ప్రగ్యా జైస్వాల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జై లవ కుశ

కొడుకు చేసిన పనికి మురిసిపోయిన ఎన్టీఆర్

అందర్నీ కొట్టేసాడు: ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఎన్టీఆర్ గురించి ఓ ట్వీట్ చేసినందుకు నానిపై కులం ఆరోపణలు చేశారు.



Click it and Unblock the Notifications











