twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుట్ర సీన్‌తో ఇంటర్వెల్... ఎమోషనల్ క్లైమాక్స్: ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ప్రీమియర్ షో హైలైట్స్!

    |

    ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' ఫిబ్రవరి 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితే గురువారం(జనవరి 21) సాయంత్రమే యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక షోలు వేశారు.

    క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొత్తం 2 గంటల 8 నిమిషాల నిడివితో ఉంది. ఎన్టీ రామారావు చిన్ననాటి జ్ఞాపకాలకు ఓ పాటను జోడించి సినిమా మొదలు పెట్టారు. ప్రీమియర్ షో హైలెట్స్ ఏమిటో ఓ లుక్కేద్దాం.

    రామారావు రాష్ట్ర పర్యటనతో ప్రజల పులకింత, రూ. 2 కిలో బియ్యం స్కీమ్

    రామారావు రాష్ట్ర పర్యటనతో ప్రజల పులకింత, రూ. 2 కిలో బియ్యం స్కీమ్

    తెలుగు దేశం పార్టీని స్థాపించిన రామారావు రాష్ట్ర పర్యటన చేపట్టడంతో... అప్పటి వరకు ఆయన్ను కేవలం తెరపైనే చూసిన జనం ఆయన్ను తమ కళ్లారా చూసి పులకించిపోయే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం స్కీమ్ ప్రకటించడం లాంటి సన్నివేశాలు బావున్నాయి.

    చంద్రబాబు నాయుడుగా రానా ఎంట్రీ

    చంద్రబాబు నాయుడుగా రానా ఎంట్రీ

    నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ఎంట్రీ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారంలో రామారావు కరెంట్ షాక్‌కు గురైన సన్నివేశాలతో పాటు ముఖ్యమైన సీన్లతో ఎన్నికల ప్రచార ఘట్టాన్ని చిత్రీకరించారు.

    ముఖ్యమంత్రిగా ప్రమాణం, ఆస్తుల పంపకాలు

    ముఖ్యమంత్రిగా ప్రమాణం, ఆస్తుల పంపకాలు

    ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రామారావు స్థాపించిన పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆస్తుల పంపకాలు చేసిన సీన్లు కూడా చూపించడం గమనార్హం.

    పార్టీలోకి చంద్రబాబుకు ఆహ్వానం

    పార్టీలోకి చంద్రబాబుకు ఆహ్వానం

    అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయాలను వదిలేసి తిరుపతి వెళతారు. ఆయన్ను తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించి పార్టీ నిర్మాణం, బలోపేతం చేసే బాధ్యతను అప్పగిస్తారు.

    గవర్నర్ రాజీనామా ఆదేశం సీన్‌తో ఇంటర్వెల్

    గవర్నర్ రాజీనామా ఆదేశం సీన్‌తో ఇంటర్వెల్

    ఎన్టీ రామారావు యూఎస్ఏ వెళ్లిన తర్వాత నాదేండ్ల భాస్కర్ రావు ఇందిరా గాంధీని కలిసి రామారావుకు వ్యతిరేకంగా పథకం రచించినట్లు చూపించారు. యూఎస్ఏ నుంచి రామారావు తిరిగి రాగానే మంత్రులు తిరుగుబాటు చేయడం, అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయడం... రాజీనామా చేయాలని గవర్నర్ రామారావుకు ఆదేశాలు జారీ చేయడంతో ఇంటర్వెల్ పడుతుంది.

    తిరిగి అధికారంలోకి ఎన్టీఆర్

    తిరిగి అధికారంలోకి ఎన్టీఆర్

    నాదేండ్ల భాస్కర్ రావు సంఘటన తర్వాత ఎన్టీ రామారావు మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు చేసిన చేసిన ప్రయత్నాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఆ సమయంలో జరిగిన పాలిటికల్ డ్రామాను కళ్లకు కట్టినట్లు చూపించారు.

    ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్

    ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్

    రామారావు అసెంబ్లీలో తన బలం నిరూపించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఆయన భార్య బసవతారకం కేన్సర్‌తో మరణించిన ఒక ఎమోషనల్ సీక్వెన్స్‌తో సినిమాను ముగించారు. ప్రీ క్లైమాక్స్‌లో బాలకృష్ణ-విద్యాబాలన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి.

    English summary
    NTR Mahanayakudu movie highlights. N.T.R: Mahanayakudu is a 2019 Telugu biographical film, based on the life and political career of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati, Vishnu Induri under NBK Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X