twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్రెడీ నష్టం.. మా గోడు పట్టించుకోరా? ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ రేట్లు హడల్

    |

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ మూవీ ప్లాన్ చేసిన నందమూరి బాలకృష్ణ... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించారు. తండ్రి సినిమా కావడంతో నిర్మాణ బాధ్యతలు కూడా బాలయ్యే చేపట్టారు. తాను ఈ సినిమా డబ్బు కోసం తీయడం లేదని, ఒక మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు స్పష్టం చేశారు కూడా.

    మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' పేరుతో మహానటుడి నట జీవితాన్ని ఫోకస్ చేస్తూ రూపొందించారు. సినిమాపై భారీ హైప్ రావడం, పైగా సంక్రాంతి రిలీజ్ కావడంతో బిజినెస్ ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. ఏకంగా రూ. 71 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. సినిమాకు మంచి టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. రూ. 20 కోట్లకు మించి షేర్ వసూలవ్వలేదు. బయ్యర్లు దాదాపు రూ. 50 కోట్లు నష్టపోక తప్పలేదు.

    మా సమస్యలు పట్టించుకోరా?

    మా సమస్యలు పట్టించుకోరా?

    మొదటి భాగం సంక్రాంతికి విడుదలైనా భారీ నష్టాలు చవిచూడటంతో ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్ ఆశించిన స్థాయిలో జరుగడం లేదని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ భారీ లాస్ వచ్చినా... తమ సమస్యను పట్టించుకోకుండా ఎక్కువ రేటు చెబుతుండటంతో బయ్యర్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారట.

    నష్టపోయిన వారిపై కనికరం లేకుండా

    నష్టపోయిన వారిపై కనికరం లేకుండా

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్ బయోపిక్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకరు ‘మహానాయకుడు' బిజినెస్ డీల్ చేస్తున్నారని, మొదటి భాగం వల్ల నష్టపోయిన బయ్యర్ల కష్టాలు పట్టించుకోకుండా మేము చెప్పిన రేటు ఇవ్వాల్సిందే, నష్టపోయిన మీపై ఎలాంటి కనికరం చూపించబోము అని బీష్మించుకుని కూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ముందు ఆడబ్బు కట్టాలని ఒత్తిడి

    ముందు ఆడబ్బు కట్టాలని ఒత్తిడి

    ఒక ఏరియాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ ‘ఎన్టీఆర్-కథానాయకుడు' రైట్స్ సొంతం చేసుకునే సమయంలో రూ. 50 లక్షలు తక్కువ చెల్లించారని, ఇపుడు అవి కడితేనే ‘మహానాయకుడు' రైట్స్ ఇస్తామని చెబుతున్నారని, ఆ డబ్బు కట్టి రైట్స్ సొంతం చేసుకుందామన్నా నిర్మాతలు చెబుతున్న రేటు అంగీకారయోగ్యంగా లేదని టాక్.

    నైజాంలో తప్ప అన్ని ఏరియాల్లో

    నైజాంలో తప్ప అన్ని ఏరియాల్లో

    ‘ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రాన్ని నైజాం ఏరియా తప్ప అన్ని ఏరియాలకు భారీ రేటుకు అమ్మి నిర్మాతలు లాభాలు గడించారు. అయితే నైజాం డిస్ట్రిబ్యూటర్ మాత్రం రిటర్నబుల్ అడ్వాన్స్ బేసిస్‌లో తీసుకుని బచాయించాడట.

    ట్రేడ్ వర్గాల్లో హడల్

    ట్రేడ్ వర్గాల్లో హడల్

    థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని మంచి రేటు పలకడంతో నిర్మాతలు భారీ లాభాలు పొందారు. అయితే సినిమా బాక్సాపీసు వద్ద బోల్తాపడి బయ్యర్లు తీవ్రంగా నష్టపోతే వారిని కనీసం పట్టించుకోకుండా.. రెండో భాగానికి కూడా భారీ రేటుకు చెబుతుండటం చూసి ట్రేడ్ వర్గాలు హడలిపోతున్నాయి.

    యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆల్రెడీ సంకేతాలు

    యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆల్రెడీ సంకేతాలు

    మరో వైపు యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగా నష్టపోక తప్పలేదు. ‘మహానాయకుడు' చిత్రానికి నిర్మాతలు రూ. 3 కోట్ల రేటు చెబుతుండటంతో తీసుకోవడానికి అయిష్టంగానే ఉన్నారట. అంతే కాదు వేరే డిస్ట్రిబ్యూటర్‌కు సినిమాను అమ్ముకోవాలని హింట్ ఇవ్వడంతో పాటు నిర్మాతలు ఇచ్చే 25శాతం పరిహారం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారట.

    పరిహారం తక్కువ.. రేటు ఎక్కువ

    పరిహారం తక్కువ.. రేటు ఎక్కువ

    మొదటి భాగం వల్ల నష్టపోయిన వారికి పరిహారం కేవలం 25 శాతం మాత్రమే ఆఫర్ చేస్తూ... రెండో భాగానికి భారీగా రేటు చెబుతుండటాన్ని బట్టి నిర్మాతలు భారీగా డబ్బు రాబట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇది ఎంత మాత్రం అంగీకారం కాదని కొందరు డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. మరి చివరకు ఈ మూవీ బిజినెస్ ఎంత వరకు లాక్కొస్తారు? నిర్మాతలు కాంప్రమైజ్ అవుతారా? లేక కొత్త బయ్యర్లు ఎవరైనా సినిమాను కొనడానికి ముందుకు వస్తారా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

    English summary
    NTR Mahanayakudu pre release business in talk. The makers are quite calculative and they are in plans to offer less refund and quote huge prices for the second installment which will again make them mint money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X