»   » చెన్నైలో ‘అమ్మ’ను కలవబోతున్న ఎన్టీఆర్!

చెన్నైలో ‘అమ్మ’ను కలవబోతున్న ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనతా గ్యారేజ్ షూటింగులో భాగంగా జూ ఎన్టీఆర్ ప్రస్తుతం చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఉండటంతో తాత ఎన్టీఆర్ జయంతి రోజు కూడా ఆయన హైదరాబాద్ లో అందుబాటులో లేరు. చెన్నై వెళ్లే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల తాతగారి సమాధిని దర్శించుకుని, నివాళ్లులు అర్పించి, కొంతసేపు అక్కడే గడిపి వెళ్లారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చెన్నైలో ముఖ్యమంత్రి జయలలితను కలవబోతున్నట్లు సమాచారం. తమిళనాడు ప్రజలచే అమ్మగా పిలవబడే జయలలిత ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మకు కంగ్రాట్స్ చెప్పడానికి ఎన్టీఆర్ తో పాటు జనతాగ్యారేజ్ టీం అమ్మను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో వారు అమ్మను కలిసే అవకాశం ఉంది.

మరో వైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జనతాగ్యారేజ్ షూటింగ్ సెట్స్ వెళ్లి ఎన్టీఆర్ కు పుట్టినరోజు విశేష్ బిలేటెడ్ గా అందజేసారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఫోటోలు పోస్టు చేసారు. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కలవలేక పోయా. అందుకే స్వర్గీయ ఎన్టీఆర్ బర్తే సందర్బంగా ఎన్టీఆర్ ను విష్ చేస్తున్నాను అని దేవిశ్రీ పేర్కొన్నారు.


స్లైడ్ షోలో ఫోటోస్....

అమ్మ దర్శనం

అమ్మ దర్శనం


చెన్నైలో ఉన్న ఎన్టీఆర్ జయలలితను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్


చెన్నైలోని జనతా గ్యారేజ్ సెట్లో ఎన్టీఆర్ ను కలిసిన దేవిశ్రీ ప్రసాద్.

లేటుగా...

లేటుగా...


ఈ నెల 20న పుట్టినరోజున తారక్ ను కలవలేక పోయిన దేవిశ్రీ....అందుకే స్వర్గీయ ఎన్టీఆర్ బర్తే సందర్బంగా నిన్న కలిసారు.

తాతకు నివాళి

తాతకు నివాళి


చెన్నై వెళ్లే ముందే ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి తాతకు నివాళి అర్పించారు.

బర్త్ డే సందర్భంగా

బర్త్ డే సందర్భంగా


ఈ నెల 20న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీతో గడిపారు.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

English summary
The shooting of NTR's Janatha Garage has now shifted to Chennai and some very crucial scenes were also shot today. Since NTR is in Chennai, he has decided to meet Jayalalitha, the chief minister of Tamil Nandu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu