»   »  కొరటాల ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ లుక్ అదిరింది (ఫోటోలు)

కొరటాల ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ లుక్ అదిరింది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్‌లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను ఓ రేంజిలో చూపిస్తారని అంచనా వేస్తున్నారు అభిమానులు.

తాజాగా జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో రీలీజ్ అయింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. ఇటీవల ముంబైలో ఎన్టీఆర్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

లొకేషన్ స్టిల్

లొకేషన్ స్టిల్


జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన లొకేషన్ స్టిల్.

ఎన్టీఆర్

ఎన్టీఆర్


దర్శకుడు కొరటాల శివ, మళయాల నటుడు మోహన్ లాల్ తో కలిసి ఎన్టీఆర్.

సెల్ఫీ

సెల్ఫీ


ఎన్టీఆర్, మోహన్ లాల్, కొరటాల, బ్రహ్మాజీ సెల్ఫీ...

ముంబై సీన్

ముంబై సీన్


ముంబైలో జరిగిన ఫైట్ సీన్ దృశ్యాలు.

మాస్ ఎంటర్టెనర్ గా

మాస్ ఎంటర్టెనర్ గా


‘జనతా గ్యారేజ్' చిత్రం మాస్ ఎంటర్టెనైర్ గా ఉండబోతోంది.

English summary
‎‎NTR‬, Mohanlal and ‎Koratala Siva‬ on the sets of ‪‎Janatha Garage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu