»   »  ఎన్టీఆర్ కు బాలయ్య క్లాప్

ఎన్టీఆర్ కు బాలయ్య క్లాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు వి.వి. వినాయక్ రూపొందించనున్న కొత్త సినిమా ఈ రోజు (ఏప్రిల్ 23) ఉదయం 9 గంటలకు లాంఛనంగా ప్రారంభమయింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్.ఎన్.సి.సి) లో జరిగిన ఈ పంక్షన్ కి సినీ ప్రముఖులు విచ్చేసారు. మూహూర్తపు సన్ని వేశానికి బాలకృష్ణ క్లాప్ నివ్వగా యస్.యస్.రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేసాడు. సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. అభిమానుల ఆనందపు హోరుతో అక్కడ ప్రాంతం దద్దరిల్లి పోయింది.

వినాయక్‌ ...ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో ఇంతవరకు 'ఆది', 'సాంబ' సినిమాలు వచ్చాయి. ఇది మూడో సినిమా. 'కృష్ణ' హిట్ తర్వాత వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావటంలో బయ్యర్లు దీనిపై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు గా త్రిష, ఇలియానా పేర్లు వినిపిస్తున్నాయి. రచనా సహకారం దశరథ్ అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు కెమారా, ఆనంద సాయి ఆర్ట్ వర్కు , చంద్రబోస్ పాటలు ,గౌతంరాజు ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. కొడాలీ మూవీస్ బానర్‌పై కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈ సినిమాను సమర్పింస్తున్నారు. వల్లభనేని వంశి దీన్ని నిర్మిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ 'కంత్రి' సినిమా మే 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X