»   » వావ్..! యంగ్ టైగర్ క్రికెటర్ గా కనిపిస్తాడట

వావ్..! యంగ్ టైగర్ క్రికెటర్ గా కనిపిస్తాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు ఎన్టీఆర్ అనగానే తొడ కొట్టటం, బాంబులు పేలటం అన్నట్టుగానే ఉండేది అందరి అభిప్రాయం. ఒక పీక్ స్టేజ్ లో ఉండగా ఈ విషయం అర్థమయిన జూనియర్ కొన్నేళ్ళ కిందట దారి మార్చాడు కంత్రీ నుంచీ వరుసగా తారక్ ఎంచుకున్న పాత్రలు చూస్తే ప్రతీ సినిమాలోనూ ఒక కొత్త దనం ఉండేలా చూసుకుంటూ వచ్చాడు, మధ్యలో దమ్ము వచ్చినప్పుడు మళ్ళీ దారి మళ్ళుతున్నాడు అనిపించినా ఊసరవెల్లి, బృందావనం లాంటి సినిమాలు యంగ్ టైగర్ లో ఉన్న కొత్త దనాన్ని బయటికి తెచ్చాయి. అక్కడి నుంచీ ఎన్టీఆర్ ఎంచుకునే ప్రతీపాత్రా ఏదో ఒక ప్రత్యేకత తోనే ఉంటోంది.

అదే దారిలో ఇప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టనున్నాడని తెలుస్తోంది. స్వతహాగా క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే తారక్ క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ ని ఎంచుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి..... అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న జై లవ కుశ తరువాత తారక్ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్‌తో వినాయక్ తో కలిసి పని చేయబోతున్నాడని సమాచారమ్.

NTR New Role As Cricketer

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే... అయితే అనుకోని కారణాల వల్ల త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ వాయిదా పడటం తో.ఎన్టీఆర్ చిత్రం మొదలవ్వడానికి మరింత సమయం పట్టేట్టు కనిపిస్తోంది.

దీంతో ఈ గ్యాప్ లో డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్‌తో ఓ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడట జూనియర్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న వినాయక్ ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరి.. మరోసారి మాస్ అవతారం ఎత్తబోతున్న యంగ్ టైగర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాల్సిందే...

English summary
It is learnt that NTR will certainly be seen as a cricketer. it is not a bio-pic of any cricketer
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu