»   » జూ ఎన్టీఆర్‌కు అలాంటి ఆలోచనే లేదు....రీమేక్ పుకారే!

జూ ఎన్టీఆర్‌కు అలాంటి ఆలోచనే లేదు....రీమేక్ పుకారే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయిన విజయ్ ‘కత్రి' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అని తేలి పోయింది. అసలు జూ ఎన్టీఆర్ కు ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనే లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్,దేవి కాంబినేషన్ లో వచ్చిన ఐటం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్. 'అ అంటే అమలాపురం', 'ముప్పీ ఆరు.. ఇరవై ఆరు..', 'రింగ రింగ', 'డియాలో డియాలో', 'లండన్‌ బాబు..' ఇలా పాటలన్నీ అదరగొట్టిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడు అలాంటి సాంగ్ ఒకటి ఎన్టీఆర్ చిత్రం కోసం దేవి రెడీ చేసారని తెలుస్తోంది.

ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

NTR not interested on Kaththi remake

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. జనవరి 8, 2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

English summary
Film Nagar reports said that Vijay’s ‘Kaththi’ is being remade by NTR. But sources close to us reveal that the remake is just a speculation and NTR has no idea of doing it in Telugu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu