twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గతదసరాకు ‘బృందావనం’ సూపర్ హిట్..ఈదసరాకి 'ఊసరవెల్లి’తో సంచలనం..

    By Sindhu
    |

    గత దసరాకు 'బృందావనం" వంటి సూపర్ హిట్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీార్ ఈ దసరాకు 'ఊసరవెల్లి"తో మరోసారి సంచలనం సృష్టించబోతున్నారు.'కిక్" వంటి సూపర్ హిట్ తర్వాత సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అందిస్తున్న మరో సూపర్ మూవీ 'ఊసరవెల్లి". 'ఛత్రపతి, డార్లింగ్" వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన భారీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై నిర్మించిన మరో భారీ చిత్రం 'ఊసరవెల్లి". ఈ చిత్రం విశేషాల్ని నిర్మా బివిఎస్ఎన్ ప్రసాద్ చెబుతూ....

    ఈచిత్రానికి 'ఊసరవెల్లి" టైటిల్‌ కన్‌ఫర్మ్‌ అయింది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మా శ్రీవెంకటేశ్వర సినీచిత్రం ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ బేనర్‌లో ప్రతిష్టా త్మకంగా నిర్మిస్తున్న చిత్రానికి 'ఊసర వెల్లి" టైటిల్‌ ను కన్‌ ఫర్మ్‌ చేశాము. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పవర్‌ పుల్‌ స్టోరీతో, హైటెక్నికల్‌ వేల్యూస్‌ తో రూపొందు తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పెర్‌ ఫార్మెన్స్‌ హైలైట్‌ గా వుంటుంది.అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసి ఈచిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

    రాబోయే చిత్రాల్లో హై ఎక్స్‌ పెక్టేషన్స్‌ వున్న ఈ భారీ చిత్రంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ళభరణి, విదూత్‌ జామ్వాల్‌, ఆధ్విక్‌ మహాజన్‌, పాయల్‌ ఘెష్‌, ఆలీ, జయ ప్రకాష్‌రెడ్డి, రఘు బాబు, ఎంఎస్‌ నారాయణ, దువ్వాసి మోహన్‌, రఘు కారుమంచిలతో పాటు ఇం కొంతమంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి కథ : వక్కంతం వంశీ, మాటలు : కొరటాల శివ, సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫొటోగ్రఫీ :రసూల్‌ ఎల్లోర్‌, ఆర్ట్‌ : రవీందర్‌, ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వర రావు,పాటలు : చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌, రామజోగయ్య శాస్త్రి, కో- డైరెక్టర్స్‌ : సత్యంబాబు, సురేష్‌ కోటా, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : సూరప నేని కిషోర్‌చ లైన్‌ ప్రొడ్యూసర్‌ : చక్రవర్తి రామచంద్ర, సమర్పణ : భోగపల్లి బాపినీడు , నిర్మాత : బి.వి. ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం : సురేందర్‌రెడ్డి.

    English summary
    Jr Ntr starrer Oosaravelli has got its release date. The film-makers have decided to release the film on 6th, October during Dussera time. Meanwhile, the audio launch will take place on 12th, September at Shilpa Kala Vedika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X