ఎన్టీఆర్, పవన్ ల చేత మళ్లీ...
హైదరాబాద్ : పవన్ నటిస్తున్న 'సర్దార్' ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోల చేత సందీత దర్సకుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు పాడిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దేవినే చెప్పాడు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ....''పవన్, ఎన్టీఆర్‌ల చేత మరోసారి పాట పాడిద్దామనుకొంటున్నా. స్టార్స్‌తో పాటలు పాడించడం కావాలని ప్లాన్ ప్రకారం చేయడం ఉండదు. ఏదో ఆ టైమ్‌కి అలా కుదురుతుందంతే'' అని చెప్పుకొచ్చాడు.

గతంలోనూ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, సిద్దార్థ్, మమతామోహన్‌దాస్, ఛార్మిలతో పాటలు పాడించేశాడు. 'అత్తారింటికి దారేది'లో పవన్ పాడిన 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా' పాట పవన్ అభిమానుల్ని ఆకట్టుకొంది.
'అదుర్స్'లో ఎన్టీఆర్ ఓ పాట హమ్ చేసి.. ఓకే అనిపించాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరితో పాటలు పాడించడానికి రెడీ అవటంతో అభిమానుల్లో ఆనందానికి పట్టపగ్గాలు లేవు.


Click it and Unblock the Notifications











