»   » కొడుకు బర్త్ డే ఫంక్షన్ మీద ఇంత పంతం ఎందుకు? ఎన్టీఆర్ ఎందుకిలా చేస్తున్నాడు??

కొడుకు బర్త్ డే ఫంక్షన్ మీద ఇంత పంతం ఎందుకు? ఎన్టీఆర్ ఎందుకిలా చేస్తున్నాడు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

"టెంపర్", "నాన్నకు ప్రేమతో" వరుస విజయాలతో జోరుమీదున్న ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్‌'తో హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని అటు పరిశ్రమలోను, ఇటు అభిమానుల్లోను బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రానున్న జనతా గ్యారేజ్ మూవీ విషయంలో ఫ్యాన్స్ ఇప్పటికే ఓసారి నిరుత్సాహపడ్డారు. ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాని సెప్టెంబర్ 2కి వాయిదా వేయడంతో డిజప్పాయింట్ అయినా.. తర్వాత యూనిట్ నుంచి వచ్చిన క్లారిటీతో సర్దుకున్నారు. సరే అనుకుంటున్న తరుణం లోనే స్వయంగా ఎన్టీఆరే తన అభిమానులకి నిరాశ కలిగించే నిర్ణయం ఇంకొకటి తీసుకున్నాడట.

ఈ నెల 22న తారక్ తనయుడు అభయ్ రామ్ పుట్టినరోజు.గత కొద్దీ రోజులుగా జనతా గారేజ్ ఆడియో ణ్టృ కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజే రిలీజ్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ఆడియో వేడుకలోనే నందమూరి వారసుడు అభయ్ రామ్ పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహింస్తున్నట్టు వార్తలు వినిపించాయి.మాములుగా హీరోల పుట్టిన రోజులు,వారి వారసుల పుట్టిన రోజులు అభిమానుల సమక్షంలో జరగడం కొత్తేమి కాదు.కానీ తాజాగా అభిమానుల ఆసలమీద నీళ్ళు జల్లుతూ. ఈ ఆలోచననని విరమించుకున్నట్టు సమాచారం.

NTR Refuse to Celebrates Abhay Ram Second Birthday

హీరోలు, వారి పిల్లల పుట్టినరోజుల నాడు అభిమానులు సెలబ్రేషన్స్‌తో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎప్పట్నుండో ఆనవాయితీగా వస్తోంది. అభయ్ రామ్ తొలి పుట్టినరోజు లండన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌ సమయం గనక అప్పుడలా జరిగిందనుకున్న అభిమానులు ఇక్కడ తాము చేయాల్సిందే చేశారు.ఈ సారి కూడా అలాంటి ప్రయత్నలు మొదలు పెడుతూందగానే....

NTR Refuse to Celebrates Abhay Ram Second Birthday

అభయ్ రామ్ పుట్టిన రోజున ఎటువంటి ప్రోగ్రామ్స్ వద్దని ఎన్టీఆర్ చెప్పాడట. ఈమేరకు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికమైన మెసేజ్ ఒకటి ఫ్యాన్స్ కి చేరిందని తెలుస్తోంది. అభయ్ రామ్ మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రెండో బర్త్ డేకి మాత్రం అసలు వేడుకలు వద్దని చెప్పడం ఆశ్చర్యపోయారు. ఎందుకు వద్దంటున్నాడో ఎన్టీఆర్ నుంచి ఎటువంటి క్లారిటీ కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు... అయితే ఆ నిరాశనీ, అలకనీ 'జనతా గ్యారేజ్' ఆడియోతో తీర్చి మళ్ళీ వారిలో జోష్ నింపే ప్రయత్నాల్లోనే ఉన్నాడు ఎన్టీఆర్.

English summary
Jr NTR has reportedly sent a message to all of his fans association presidents from different districts that they should not take up any celebration. on his son Abhay Ram's second Birth Day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu