Just In
Don't Miss!
- Finance
5 నెలల్లో రూ.8500 తగ్గిన బంగారం, వెండి రూ.14,000 డౌన్: 2009 తర్వాత తొలిసారి...
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నన్ను, సురేంద్ర రెడ్డిని నిరాశపరచింది:ఎన్టీఆర్
గతంలో అశోక్ సినిమా ఫలితం నన్ను,సురేందర్ రెడ్డిని నిరాశపరిచింది.సిక్సర్ కొట్టాలనుకున్నా...మూడు పరుగులే తీశాం. ఈసారి మాత్రం బంతి స్టేడియం దాటుతుంది. సూరి అంత బాగా తీసాడు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని చూసుకుంటున్నప్పుడు తను ఎంత బాగా తెరకెక్కించాడో అర్దమైంది. నేను నా భాధ్యతగా కొత్త తరహా సినిమా చేసా. ఆదరించే భాధ్యత అభిమానులదే. అలాగే గతంలో నేను నటించిన సినిమాల్లో ఒక చిన్న మార్పు కూడా చెప్పకుండా ఓకే చేసిన కథలు ఆది, సింహాద్రి, ఇప్పుడు ఊసరవిల్లి మూడోది అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఊసరవెల్లి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. ఈ వేడుకలో రాజమౌళి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి.సురేష్‌బాబు, దిల్ రాజు, కె. అచ్చిరెడ్డి, నల్లమలుపు శ్రీనివాస్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, సురేష్‌రెడ్డి, గణేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.