»   » సున్నతో జీవితం మొదలుపెట్టా...ఎన్టీఆర్

సున్నతో జీవితం మొదలుపెట్టా...ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మేం ముగ్గురం సున్నతో జీవితాన్ని మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళం. అందుకే నాకు మామూలుగా దర్శకులంటే వినయ్, రాజమౌళి తప్ప ఇంకెవరూ కనిపించరు అన్నారు ఎన్టీఆర్. రీసెంట్ గా జరిగిన బృందావనం ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ రేంజి స్ధాయికి రీచయినా ఎన్టీఆర్ ఇంకా తన తొలినాటి రోజులను గుర్తుచేసుకుని మాట్లాడటం అందరూ మెచ్చుకునేలా చేసింది. ఇక దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి డైరక్ట్ చేసిన ఈ చిత్రం పాటలు విడుదలైన తొలిరోజునే మంచి అమ్మకాలు జరిగి..మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే..నేనామధ్య ట్విట్టర్ ‌లో..ప్రేమ్ ‌రక్షిత్ స్టెప్పులతో చంపేస్తున్నాడు అని రాశాను. థమన్ అంత మంచి మ్యూజిక్ ఇస్తే అతను దానికి తగ్గ స్టెప్పులు వేయించకుండా ఎలా ఉండగలడు? అని ఎన్టీఆర్ మెచ్చుకున్నట్లే పాటలు ఉన్నాయంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్,సమంత నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu