»   » సినారేకు ఎన్టీఆర్ షాక్.. రెడ్డిగారూ మీ గురించి విన్నాం.. మద్రాస్ రండి..

సినారేకు ఎన్టీఆర్ షాక్.. రెడ్డిగారూ మీ గురించి విన్నాం.. మద్రాస్ రండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, సాహితీ దిగ్గజం సీ నారాయణరెడ్డి అనుబంధం ప్రత్యేకమైనది. వారి మధ్య ఉన్న సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండేవని చెప్పుకొంటారు. సినీ పరిశ్రమలో నటులు, సాహితీవేత్తలో చాలా సానుకూలంగా వ్యవహరించేవారని, అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టమని చెప్పుకొంటారు. ఆయన వ్యవహరించే తీరు, ప్రతిభ వల్లే టాలీవుడ్‌లో పట్టు సాధించారనేది ఆయన సన్నిహితులు వెల్లడిస్తారు.

 పరిచయం గాఢమైన స్నేహంగా

పరిచయం గాఢమైన స్నేహంగా

గులేబకావళి సినిమా కోసం ఎన్టీఆర్, సినారేల మధ్య ఏర్పడిన పరిచయం గాఢమైన స్నేహంగా మారింది. సినారే గురించి తెలుసుకొన్న ఎన్టీఆర్ స్వయంగా ఆహ్వానించారట. అంతేకాకుండా ఓ డ్యూయెట్ సాంగ్‌ను రాయాలని కోరారట. ఆ చిత్రంలో అన్ని పాటలు రాసే విధంగా అవకాశం లభించడంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన రాసిన తొలిచిత్రమే మంచి గుర్తింపునివ్వడంతో సినారేకు ఎదురే లేకుండా పోయింది. ఆయన రాసిన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని పాట ఇప్పటి తరాన్ని కూడా ఉర్రూతలిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కోరిక మేరకు

ఎన్టీఆర్ కోరిక మేరకు

అప్పటికే లెక్షరర్‌గా పనిచేస్తున్న సినారే గురించి తెలుసుకొన్న ఎన్టీఆర్ .. ఇద్దరికి మిత్రుడైన ఓ వ్యక్తి ద్వారా కలిశాడు. ఆ సందర్భంగా రెడ్డి గారూ మీ గురించి విన్నాం. మేం త్వరలో తీయబోతున్న గులేబకావళి కథ చిత్రానికి మీరే పాటలు రాయాలి. వీలుచూసుకుని మద్రాసు రండి' అని ఎన్టీఆర్ కోరారట. అప్పటికే అగ్రహీరోగా ఉన్న ఎన్టీఆర్ చెప్పిన మాటలతో 1960 మార్చి 10వ తేదీన హైదరాబాద్ నుంచి మద్రాస్‌కు బయలుదేరారు.

స్వయంగా ఎన్టీఆర్ రీసీవ్..

స్వయంగా ఎన్టీఆర్ రీసీవ్..

హైదరాబాద్ నుంచి బయలు దేరిన సినారేకు మద్రాస్ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. స్వయంగా ఎన్టీఆర్ స్టేషన్‌కు వచ్చి సాదరంగా తన కారులో ఇంటికి తీసుకెళ్లారట. గులేబాకావళి సినిమా స్క్రిప్ట్ ఇచ్చి పాటల సందర్భాన్ని వివరించారట. దాంతో అణిముత్యాల్లాంటి పాటలకు అక్కడ బీజం పడింది. సింగిల్ కార్డుతో రాసిన పాటలను ఘంటశాల, సుశీల పాడారు. సినారే రాసిన పాటలకు ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు.

అణిముత్యాల్లాంటి పాటలు

అణిముత్యాల్లాంటి పాటలు

నారాయణరెడ్డి సినిమా ప్రస్థానం అలా ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో దాదాపు మూడు వేలకు పైగా పాటలు రాశారు. 1962లో ఆత్మబంధువు సినిమాలో ‘అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి'... ‘చదువురాని వాడవని దిగులు చెందకు'... కులగోత్రాలు సినిమాలో...‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా', ‘చిలిపి కనుల తీయని చెలికాడా'... రక్తసంబంధంలోని ‘ఎవరో నను కవ్వించి పోయేదెవరో', తళ్లా? పెళ్లామా? చిత్రంలో తెలుగు జాతి మనది అంటూ తన సినీ గీతాల ప్రస్థానాన్ని అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్లారు.

English summary
Before lyric writer, S Narayana Reddy was a lecturer in Hyderabad. NTR heard about narayana Reddy talent and requested and offered a song to write. Then Cnare responded to NTRs request and went to Madras. His first movie Gulebaakavali Katha was super hit. Since then he become top lyricist in tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu