twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 23 వర్దంతి: ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలయ్య... ఎమోషనల్ స్పీచ్!

    |

    ఎన్టీ రామారావు వర్దంతిని పురస్కరించుకుని నందమూరి ఫ్యామిలీ, రామారావు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. బాలయ్య, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని తదితరులు శుక్రవారం ఉదయమే ఘాట్ వద్దకు చేరుకున్నారు.

    ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ... విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారి 23వ వర్ధంతి నేడు. ఈ భూమి మీద ఎందరో పుడతారు, గిడతారు కానీ అలాంటి మహానుభావులు రాలేరు అన్నారు.

    ఆయన తెలుగు జాతికే గర్వ కారణం

    ఆయన తెలుగు జాతికే గర్వ కారణం

    ఒక మనిషి మహోన్నత విజయ పథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు వెళ్లాంలంటే సంకల్పం కావాలి, దీక్ష బూనాలి. నీదారిలో నువ్వు నడవాలి అనే దానికి స్పూర్తి ప్రదాత, ఆదర్శ మూర్తి ఆయన. తెలుగు జాతికే ఆయన గర్వ కారణమన్నారు.

    అందరూ ఆయన్ను కాపీ కొడుతున్నవారే

    అందరూ ఆయన్ను కాపీ కొడుతున్నవారే

    ఈ రోజు ఏ నాయకుడు ముందుకు వచ్చినా, ఏ పార్టీ గొంత చించుకున్నా అవన్నీ రామారావుగారు ప్రవేశ ప్రవేశ పెట్టిన పథకాలు కాపీ కొట్టి పరిపాలన సాగించిన వారే అని మరిచిపోకూడదు.

    అవినీతి సహించలేక రాజీనామా చేసి సినిమాల్లోకి...

    అవినీతి సహించలేక రాజీనామా చేసి సినిమాల్లోకి...

    ఆనాడు ఆయన ఒక రైతు బిడ్డగా పుట్టి సబ్ రిజిస్టార్ ఉద్యోగానికి రాజీనామా చేసి, లంచగొండి తనాన్ని సంహించలేక సినిమా రంగంలోకి వచ్చి ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దేవుడి పాత్రలు పోషించి ఎంతో మందిలో భక్తికి జీవం పోశారు. పార్టీ పెట్టిన కొన్ని నెల్లోనే అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల వారికి న్యాయం చేసి పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.

    ప్రతి తెలుగువాడి గుండెల్లో....

    ప్రతి తెలుగువాడి గుండెల్లో....

    తెలుగు జాతీ ఉన్నంత వరకు రామారావు ఉంటారు. ఆయన భౌతికంగా లేక పోయినా ప్రతి తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారు. ఆయన ఏ ఆశయాల కోసం జీవించారో ఏ ఆశయాల కోసం తపన పడ్డారో వాటిని మనం నెరవేర్చాలి. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని బాలయ్య వ్యాఖ్యానించారు.

    English summary
    Today is NTR's 23 rd death anniversary and Nandamuri family members including Balakrishna, Jr NTR, Kalyan Ram, Suhasini etc have paid their tribute to this great leader.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X