For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ‘బాద్‌షా’ ఆడియో వేడుక (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా బండ్ల గణేష్ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున అభిమానులు విచ్చేశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో వరంగల్‌కి చెందిన రాజు అనే వ్యక్తి మరణించారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.

  ఈ కారణంగా ఆడియో వేడుకను త్వరగా ముగించాలని కోరానని ఎన్టీఆర్ కోరారు. అదే విషయం ఎన్టీఆర్ చెబుతూ - ''ఇక ముందెప్పుడూ ఇలా జరగకూడదు. రాంబాబు కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఆ తల్లి కడుపు కోతని నేను తీర్చలేకపోవచ్చు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను. పెద్ద కొడుకుగా ఆ ఇంటికి అండగా ఉంటాను. మీ పిడికిలిలో ఉన్న గుండెకాయను నేను. నా పిడికిలిలో ఉన్న గుండె మీరు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి'' అన్నారు.

  ఎన్టీఆర్ కన్నీటి పర్యంతమవుతూ, అభిమానులకు శిరస్సు వంచి అభివాదం తెలియజేశారు ఎన్టీఆర్. చిత్ర హీరోయిన్ కాజల్‌ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఎన్టీఆర్‌తో మరోసారి నటించడం సంతోషంగా ఉందన్నారామె. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి, బెల్లంకొండ సురేష్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, కోన వెంకట్‌, గోపీమోహన్‌, కె.వి.గుహన్‌, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

  ఆడియో వేడుక విశేషాలు స్లైడ్ షో లో...

  ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో 'బాద్‌షా' గీతాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ తల్లి షాలిని, భార్య లక్ష్మీప్రణతి హాజరయ్యారు.

  తొలి సీడీని ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించారు. ఆ సీడీని వి.వి.వినాయక్‌ స్వీకరించారు.

  నిర్మాత గణేష్ మాట్లాడుతూ - ‘‘పెద్ద మనసుతో అందరూ నన్ను క్షమించండి. అమ్మా.. రేపొద్దునే మీ ఇంటికి వచ్చి, ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తాను. ఆ తర్వాత కూడా ఏది వచ్చినా ఆదుకుంటాను. నా కారణంగా జరిగిన తప్పనుకుంటే పెద్ద మనసుతో క్షమించమ్మా'' అని చనిపోయిన రాజు తల్లిని ఉద్దేశించి అన్నారు

  ఎన్టీఆర్ మాట్లాడుతూ... ‘‘ఈరోజు జరిగిన విషాదం నా జీవితంలో మర్చిపోలేనిది, చాలా బాధాకరమైనది. నా అభిమాని ఒకరు ఈ వేడుకలో తొక్కిసలాటకు గురయ్యి, ప్రాణాలు కోల్పోయాడు. మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకుని. తోబుట్టువులు లేరే అని బాధపడేవాడ్ని. కానీ ఆ దేవుడు అభిమానుల రూపంలో లక్షలాది మంది తోబుట్టువులను నాకిచ్చాడు. ఆ తోబుట్టువుల్లో ఒక తమ్ముడు నాకు దూరమైపోయాడు. చాలా బాధగా ఉంది'' అన్నారు .

  అలాగే... ''ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎంత ఆనందంగా ఉన్నానో అంతే బాధతో ఉన్నాను. చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకొంది. ఓ అభిమాని ఇక్కడకు వచ్చి మృత్యువాతపడటం దురదృష్టకరం. ఆ మరణం తట్టుకోలేనిది. ఆ తల్లి కడుపు కోత తీర్చలేనేమోగానీ ఆ ఇంటి బిడ్డను ఆదుకొంటాను. ఈ అపశ్రుతి జరగడానికి నా తరఫున ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి. మీ అందరి పిడికిలి మధ్య గుండెను నేను. నా పిడికిలి మధ్య గుండెలు మీరు. మీ ప్రేమ కోసమే నేనెప్పుడూ ఎదురు చూస్తుంటాను'' అన్నారు.

  శ్రీను వైట్ల మాట్లాడుతూ - ''ఎంతో ఆనందంగా వేడుక చేద్దామనుకొన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం బాధాకరం. ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన నా ఆనందాన్ని పంచుకోవడం సమంజసం కాదు''అన్నారు.

  రాజమౌళి మాట్లాడుతూ ''తారక్‌ని ఎంతో అందంగా చూపించారు. అభిమానులందరి తరఫున శ్రీను వైట్లకి కృతజ్ఞతలు చెబుతున్నాను. పాట కంటే ముందే బీట్‌తో ఆకట్టుకొంటారు తమన్‌. ఇక్కడ అభిమాన సందోహాన్ని చూసి వేదిక వరకూ రాగలనా అనుకొన్నాను. అప్పుడే బాద్‌షాపై నాకున్న అంచనాలు పెరిగాయి. తమన్ మ్యూజిక్ సుపర్బ్‌గా ఉంది. అభిమానుల్లో ‘బాద్‌షా'పై ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతోంది. గణేష్ ఈ చిత్రానికి బారీగా ఖర్చు పెట్టాడు. ఈ సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది.'' అన్నారు.

  ''తారక్‌ని శ్రీను వైట్ల కలిసినప్పుడు ఒక ఎపిసోడ్‌ చెప్పాడు. దాని గురించి వింటే 'దూకుడు'ని మించి ఉంది. ఇందులో హీరో పాత్ర చిత్రణ బాగుంది. నాకు, తారక్‌కీ మధ్య ఉన్నది హీరో - దర్శకుడు బంధం కాదు. అన్నదమ్ముల అనుబంధం మాది. తారక్‌ కథానాయకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకొంటున్నాను'' అన్నారు వినాయక్‌.

  ‘దిల్' రాజు మాట్లాడుతూ....ఎన్టీఆర్, శ్రీను వైట్ల అనే ఇద్దరు దిగ్గజాలు కలిసి చేసిన చిత్రం ‘బాద్‌షా'. వేసవిలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాని విడుదల చేసే అవకాశం కల్పించినందుకు గణేష్‌బాబు, ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.

  తమిళ హీరో శింబు మాట్లాడుతూ ''ఈ సినిమాలో నేను 'డైమండ్‌ గర్ల్‌' అనే పాట పాడాను. మామూలుగా అయితే పాడేవాణ్ని కాదేమో? ఎన్టీఆర్‌ నాకు మంచి స్నేహితుడు. అందుకే అంగీకరించాను. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది''అన్నారు.

  కోన వెంకట్ మాట్లాడుతూ... ‘బాద్‌షా'ని ఓ సినిమాలా కాకుండా బాధ్యతగా భావించి చేశాం. ఏప్రిల్ 5న విడుదలయ్యే ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుంది.

  'బాద్‌షా' లో కాజల్‌ హీరోయిన్ గా నటించింది. బండ్ల గణేష్‌ నిర్మాత. శ్రీను వైట్ల దర్శకుడు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

  ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ భార్య,తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  ఎన్టీఆర్ తో నిర్మాత గణేష్ బాబు

  సంగీత దర్సకుడు తమన్ ఈ ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

  English summary
  Junior NTR starrer Telugu action-drama "Baadshah" released on Sunday evening. What was supposed to be a gala evening turned sorrowful when a fan lost his life in a stampede at the audio launch. "I am saddened to know that I lost one of my brothers today. I may be the only son to my parents, but all my fans are equivalent to my brothers and sisters. This was supposed to an evening to enjoy but unfortunately it has turned sad," Junior NTR said at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X