twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ రైట్స్ : రెండో స్థానంలో నిలిచిన ‘బాద్ షా’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్‌షా' చిత్రం విడుదలకు ముందే పలు రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న విడుదలవుతున్న ఈ చిత్రం తాజాగా టీవీ రైట్స్ విషయంలో మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం టీవీ రైట్స్ విషయంలో టాలీవుడ్లో చరిత్రలో సెకండ్ బెస్ట్ ప్రైస్ రాబట్టిందని సమాచారం.

    'బాద్‌షా'పై భారీ అంచనాలు ఉండటంతో పలు టీవీ ఛానల్స్ ఈ చిత్రం హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరగా జెమినీ టీవీ వారు రూ. 8 కోట్లు చెల్లించి ఈచిత్రం హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్-వెంకీ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి అత్యధికంగా రూ. 8.5 కోట్లు టీవీ రైట్స్ రూపేణ వచ్చాయి.

    ఇప్పుడు బాద్ షా చిత్రం రూ. 8 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.

    ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    The promos of Baadshah have soared up the viewers' curiosity to sky high. There was a great demand for its satellite rights in the market and several leading channels were waiting in the queue to bag its rights. But it is Gemini TV, which has reportedly bought them for a record price. If we are to go by the reports, the channel has shelled out Rs 8 crores on the rights of the Junior NTR and Kajal Aggarwal starrer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X