For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్మతో బ్రదర్ అనీల్ కుమార్ భేటీ, ఉడికిపోతున్న ఏపీ పాలిటిక్స్: ముదురుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వివాదం

  |

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నా అని ప్రకటించిన దగ్గరి నుండీ ప్రతీ రోజూ ఒక వివాదం లో నానుతూనే ఉన్నాడు వర్మ. మొదట్లో బాలకృష్ణ వర్మ తో చేయనున్నాడని వచ్చిన టాక్ కాస్త రెండుగా విడిపోయింది. ఒక పక్క బాలయ్య తన పద్దతిలో తాను ఎన్టీఆర్ బయోపిక్ కి ప్లాన్ చేసుకుంటూంటే అదే సమయం లో తాను కూడా అదే సబ్జెక్ట్ మీద సినిమా తీస్తున్నాని ప్రకటించిన వర్మ. నాలుగు రోజులకే ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసి అందరినీ షాక్ కి గురి చేసాడు. అక్కడ మొదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం రోజుకో మలుపుతో కొత్త కొత్త వివాదాలని తెరమీదకి తెస్తూనే ఉంది.

   వైఎస్ఆర్‌సిపి లీడర్ రాకేష్ రెడ్డి నిర్మాత

  వైఎస్ఆర్‌సిపి లీడర్ రాకేష్ రెడ్డి నిర్మాత

  ఈ చిత్రానికి వైఎస్ఆర్‌సిపి లీడర్ రాకేష్ రెడ్డి నిర్మాత కావడంతో.... చాలా మందిలో ఈ సినిమా వెనక ఆ పార్టీ ఉందనే అనుమానాలు వచ్చాయి. ఇప్పటికే టీడీపీ నేతలు కొందరు వర్మ మీద డైరెక్ట్ గానే వైసెపీ ప్రొద్బలం వల్లనే ఈ సినిమా చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేసాడు కూడా. కానీ వర్మ ఇలాంటి విమర్శలకు కూడా ఘాటుగా రిప్లై ఇస్తూనే వస్తున్నాడు.

  "మైడియర్ సోమీ..!" అంటూ

  మూడు రోజులకింద మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ "మైడియర్ సోమీ..!" అంటూ వెటకారంగా బదులిస్తూ ఆయన ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఒకప్పటి నటి వాణీ విశ్వనాథ్ కూద వర్మ గనక ఎన్టీఆర్ ని కించపరిచే సినిమా తీస్తే ఆయన ఇంటిముందే ధర్నా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.

   రోడ్లమీద తిరుగుతూంటా

  రోడ్లమీద తిరుగుతూంటా

  అయితే వర్మ కూడా అంతే వెటకారం తో "నాకసలు ఇల్లే లేదు, రోడ్లమీద తిరుగుతూంటా' అంటూ సమాధానం చెప్పాడు. ఇలా ప్రతీ రోజూ ఒక వివాదం, ప్రతీ విషయం ఒక సంచలనం అన్నట్తు గా వర్మ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యం లో ఇవాల బయటకి వచ్చిన ఒక వార్త వర్మ వెనుక ఉన్నది వైసీపీ ఉందన్న మాటలకు బలన్నిచ్చేదిగా కనిపిస్తోంది.

  బ్రదర్ అనీల్ కుమార్, రామ్ గోపాల్ వర్మ

  బ్రదర్ అనీల్ కుమార్, రామ్ గోపాల్ వర్మ

  అదేమిటంటే వైఎస్ జగన్ బావ, షర్మిల కి భర్తా అయిన బ్రదర్ అనీల్ కుమార్, రామ్ గోపాల్ వర్మలు పార్క్ హయాత్ హొటల్ లో భేటీ అయ్యారు. ఇద్దరూ రహస్యంగా దాదాపు గంటన్నరసేపు రహస్యంగా మంతనాలు జరిపారట. అంతే కాదు తన దగ్గర "తమసోమా జ్యోతిర్గమయా అనే సబ్జెక్ట్ ఉందనీ, దాన్ని సినిమాగా తీసే ఆలోచన ఉందంటూ కూడా వర్మకి చెప్పారట అనీల్ కుమార్. ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ శ్రేణుల్లో సంచలనం అయ్యింది.

   టీడీపీకి వ్యతిరేకంగా రానుందా?

  టీడీపీకి వ్యతిరేకంగా రానుందా?

  నిన్నామొన్నటి దాకా చిన్న అనుమానం గానే ఉన్న విషయం కాస్త ఇప్పుడు ఈ మీటింగ్ తో పక్కా అయ్యింది. మొత్తానికి వర్మ చూపించబోతున్న ఎన్టీఆర్ పట్ల టీడీపీ లో అసహనం తారా స్థాయికి చేరుకుంటున్నట్టే ఉంది మరి. అసలు ముందు బాలయ్య తీద్దామనుకున్న ఎన్టీఆర్ బయో పిక్ చివరకు వర్మ వల్ల టీడీపీకి వ్యతిరేకంగా రానుందా? అన్న అనుమానానికి ఇప్పుడు సమాధానం దొరికినట్టే ఉంది.

  రాజకీయ విజయాలకే పరిమితం

  రాజకీయ విజయాలకే పరిమితం

  ఇక వర్మ ని కాసేపు పక్కన పెడితే... బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ సినిమా పూర్తిగా ఆయన నటజీవితం, రాజకీయ విజయాలకే పరిమితం అట. అంటే మామూలు పల్లె జీవితం నుంచి నాటకాల్లోకీ, అక్కడినుంచి సినిమాల్లోకీ వచ్చి ఒక అగ్రనటుడిగా ఎదిగిన నందమూరి తారక రామారవు గారు తర్వాత పార్తీని స్థాపించటం ముఖ్యమంత్రిగా గద్దెనెక్కటం తో పాటు మొదటి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతమూ, తర్వాత మళ్ళీ ఎన్టీఆర తన ముఖ్యమంత్రి పీఠన్ని దక్కించుకోవటమూ వంటి ఏపిసోడ్ తో ముగుస్తుందట. అంటే అ తర్వాత జరిగిన విపరీత పరిణామాల జోలికి పోకుండా జస్ట్ ఒక సక్సెస్ స్టోరీగా మాత్రమే ఈ బయో పిక్ ఉందబోతుందని టాక్.

  చెప్పులు విసిరీ అవమానించి, ఆయనని గద్దెదింపిన వైనాన్నీ

  చెప్పులు విసిరీ అవమానించి, ఆయనని గద్దెదింపిన వైనాన్నీ

  అయితే వర్మ పద్దతి వేరుకదా.. నిజంగా వైయ్యెస్సార్ పార్టీ దన్ను తోనే వర్మ సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ మీద రెండో సారి జరిగిన కుట్రనీ, ఆయన మీద చెప్పులు విసిరీ అవమానించి, ఆయనని గద్దెదింపిన వైనాన్నీ తెరమీదకి ఎక్కించే ప్రయత్నమే జరుగుతుంది. ఇక అలా గనక సినిమా తయారయితే విలన్ గా ఎవరుంటారో పక్కాగా చెప్పనే అక్కర లేదుకదా. ఇప్పుడు అదే టీడీపీ శ్రేణుల భయం అట.

  పేలటానికి సిద్దంగా ఉన్న డైనమెట్

  పేలటానికి సిద్దంగా ఉన్న డైనమెట్

  మొత్తానికి వర్మ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలనీ, రాజకీయ చరిత్రనీ తలకెత్తుకొని కూర్చున్నాడు. పేలటానికి సిద్దంగా ఉన్న డైనమెట్ లా కొందరిని లక్ష్మీస్ ఎన్టీఆర్ భయపెడుతోంది అంటూ వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్ట్ లు కూడా వర్మ సినిమా మీద ఎలంటి ఉద్దేశ్యం బయట ఉందో చెప్పకనే చెబుతున్నాయి.

  English summary
  NTR's Biopic issue creating sensational in Tollywood. One biopic is producing by NTR's Son Balakrishna, another movie is going to direct by Ram Gopal Varma. In this junxture, Brother Anil Kumar met Ram Gopal Varma on Saturday make media attention. This kind of events heated Andhra Pradesh politics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X