»   » జనతా గ్యారేజ్: ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌

జనతా గ్యారేజ్: ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఇక్కడ ఎన్టీఆ‌ర్‌తో కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చేయించబోతున్నాడట.. 


ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షెడ్యూల్‌లోనే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది ఎన్టీఆర్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫైట్‌గా నిలుస్తుందని దర్శకుడు కొరటాల చెప్పాడు. గతంలో రిలీజైన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో చెప్పుకోతగ్గ భారీ ఫైట్స్ ఏమి లేవు. దీంతో మాస్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారని తారక్ ఫీలవుతున్నాడట. ఈ సినిమాతో ఆ లోటు తీర్చేసుకోవాలని కూడా ఎన్టీఆర్ భావిస్తున్నాడట.

NTR's career best fight scens in Janatha garage

ముంబైలోని బాంద్రాలో చిత్రీకరించే ఈ భారీ ఫైట్ సీక్వెన్స్‌ని.. ఫైట్ మాస్టర్ అణల్ అరసు సమకూరుస్తున్నాడు. భారీగానే కాకుండా.. స్టైలిష్ గా కూడా ఈ ఫైట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి ఈ సీక్వెన్స్ షూటింగ్ ప్రారంభం కానుంది.. ఈ భారీ ఫైట్‌ని ఈ నెల 15 నుండి యూనిట్ సభ్యులు మొదలు పెట్టనున్నారట.

అలాగే కొరటాల శివ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఓ రేంజ్‌లో చూపించడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాడట. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ గత చిత్రాల కంటే డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాడానికి ప్రయత్నిస్తున్నాడట.

English summary
Director KoraTala planing a Grand action sequence in janatha garage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu