Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తోట రాముడిగా బాలయ్య.. చరిత్ర సృష్టించిన చిత్రం, రిజెక్ట్ చేసిన మెగా బ్రదర్!

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బాలయ్య నిమగ్నమై ఉన్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న అద్భుత ఘట్టాలన్నింటిని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సంకాంత్రికి ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగాన్ని విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో అద్భుత చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తోట రాముడిగా నటించిన పాతాళ బైరవి ఒక క్లాసిక్. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ చిత్రానికి సంబంధించిన సన్నివేశల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చరిత్ర సృష్టించిన చిత్రం
పాతాళ భైరవి చిత్రం 1951లో విడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రం తెలుగు సినిమా ప్రతిభకు అద్దం పట్టింది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి నటులు ప్రధానపాత్రల్లో నటించారు. అద్భుతమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం ఇప్పటికి ప్రేక్షకులని కూడా అబ్బురపరుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన కళా ఖండాల్లో పాతాళభైరవి కూడా ఒకటి.

తోట రాముడిగా బాలయ్య
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో తోటరాముడి పాత్రని బాలయ్య మరోమారు గుర్తు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో బాలయ్య లుక్ ఎన్టీఆర్ ని గుర్తు చేసే విధంగా ఉంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. ప్రస్తుతం పాతాళభైరవి చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అభిమానులకు కనువిందు
ఈ చిత్రంలో బాలయ్య 60 పైగా గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లాగా బాలయ్య కనిపించే ప్రతి గెటప్ అభిమానులకు కనువిందు చేయనుంది. వేటగాడు, గుండమ్మ కథ లాంటి చిత్రాలకు సంబందించిన బాలయ్య లుక్ ఇప్పటికే విడుదల చేశారు. తోటరాముడి గెటప్ లో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

నేపాల మాంత్రికుడు ఎవరు
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినీజీవితంలో భాగమైన చాలా మంది నటులు, దర్శకుల పాత్రలకు ఇప్పటి స్టార్స్ ని ఎంపిక చేశారు. ఎస్వీ రంగారావు పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే క్లారిటీ ఇంకా రాలేదు. ఈ అవకాశం మెగా బ్రదర్ నాగబాబుకు వచ్చినట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ పాత్రని నాగబాబు రిజెక్ట్ చేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ నాటక రంగానికి చేసిన ఆర్టిస్ట్ ని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.