»   » బాలయ్య నడిపిస్తున్న ట్రస్టుకు....జూ ఎన్టీఆర్ భారీ విరాళం?

బాలయ్య నడిపిస్తున్న ట్రస్టుకు....జూ ఎన్టీఆర్ భారీ విరాళం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన తాజా సినిమా ‘నాన్నకు ప్రేమతో' సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఎన్టీఆర్ ఎపిసోడ్ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ వీకెండ్ ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.

తాజాగా షూటింగ్ స్పాట్ నుండి లీకైన సమాచారం ప్రకారం ఈ షోలో జూ ఎన్టీఆర్ రూ. 12,50,000 గెలుపొందినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఎన్టీఆర్...విరాళంగా ప్రకటించారని.... సగం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి, మరో సగం ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా ప్రకటించారని అంటున్నారు. బసవతారకం క్యాన్సర్ ట్రస్టు ఆసుపత్రి బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు సమక్షంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు, బాలయ్యలతో.... జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు సరిగా లేవనే వార్తల నేపథ్యంలో ఆయన వారి ఆధ్వర్యంలో నడస్తున్న ఆసుపత్రికి, ట్రస్టుకు ఈ విరాళం ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

 NTR's Donation To Basavatarakam, NTR Trust?

నాన్నకు ప్రేమతో సినిమా విషయానికొస్తే....
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం జనవరి 4తో పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Source said that, NTR won a whopping Rs. 12,50,000 in MEK show. NTR then announced that he will donate half the amount to Basavatarakam Cancer Hospital and the other half to the NTR Trust.
Please Wait while comments are loading...