»   » ఊపేస్తోంది: ఎన్టీఆర్ పాడిన పాట టీజర్ (వీడియో)

ఊపేస్తోంది: ఎన్టీఆర్ పాడిన పాట టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరో గానే కాదు సింగర్‌గానూ తన టాలెంట్‌ను నిరూపించుకున్న జూనియర్ ఇటీవల కన్నడ చిత్రం చక్రవ్యూహలో ఓ పాట పాడాడు. థమన్‌ ఆధర్వ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియోను మార్చి 8న అంటే ఈ రోజు బెంగళూరులో విడుదల చేయనున్నారు.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాడిన పాట టీజర్ ని వదిలారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమలో ఈ టీజర్ ఒక ఊపు ఊపుతోంది. ఈ చిత్రంలో హీరోగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటిస్తున్నాడు.

గతంలో కొన్ని సినిమాల్లో సాంతంగా పాట పాడిన ఎన్టీఆర్ ... రభస సినిమాలో పాడిన 'రాకాసి రాకాసి' అనే పాట మంచి గుర్తింపు తెచిపెట్టింది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని 'ఫాలో ఫాలో సాంగ్ అయితే ఒక సెన్సేషన్ . ఇప్పుడు ఎన్టీఆర్ తన సింగింగ్ ట్యాలెంట్ ని ఇలా కన్నడ ప్రేక్షకులకు రుచి చూపించదానికి రెడీ అయ్యాడు.

ఈ ఆడియో వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లోహిత్ నిర్మాత. తెలుగు మూవీ బ్రూస్ లీలో నటించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో విల్ గా చేస్తున్నారు. అలనాటి అగ్ర నటులు ఎన్టీఆర్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉండేది. వారిద్దరి స్నేహాబంధాన్ని వారి వారసులైన ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌లు ఇంకా కొనసాగిస్తుండటం విశేషం.

NTR’s Geleya Geleya Song From kannada Movie Chakravyuha

 
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఇటీవల విడుదలైంది. పునీత్ రాజ్ కుమార్ కు కూడా 'చక్రవ్యూహ' 25వ చిత్రం కావడం విశేషం. తన 25వ చిత్రం స్పెషల్ గా ఉండాలని తన ప్రెండ్ అయిన ఎన్టీఆర్ తో 'చక్రవ్యూహ'లో పాట పాడించాడు పునీత్.

కన్నడ భాష అయినప్పటికీ....పాట పాడేప్పుడు ఎన్టీఆర్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదట. నిజానికి ఎన్టీఆర్‌కు కన్నడ భాషపై కూడా పట్టుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తల్లి షాలిని మాతృభాష కన్నడ. అందువల్ల ఆ భాషతో చిన్న తనం నుండే ఎన్టీఆర్‌కి పరిచయం ఉంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో కూడా ఎన్టీఆర్ పాట పాడిన సంగతి తెలిసిందే.

English summary
Jr NTR has crooned for a Kannada song for the first time, for the movie “Chakravyuh”. The song goes by the lyric Geleya Geleya and it will be released on March 8th at 12.00 AM.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu