»   »  ఎన్టీఆర్ గుండెపై కొట్టుకుంటూ..(వీడియో)

ఎన్టీఆర్ గుండెపై కొట్టుకుంటూ..(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. సంక్రాంతి కానుకగ జనవరి 13న విడుదలైన ఈ సినిమా 10రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబందించి సక్సెస్ సెలబ్రెషన్స్ హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సినిమాలో కుడి చేతిని గుండెకు తగిలించి, చప్పట్లు కొట్టె సీన్ ను అందరు స్టేజ్ పై ఒక్కసారిగా చేసిని వీడియోను నాన్నకు ప్రేమతో టీం తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతలో పెట్టింది. దానిని మీరు ఇక్కడ చూడండి.


#NannakuPrematho team success celebrations at Success Meet ! #SankranthiSensationalHit


Posted by Nannaku Prematho on Friday, January 22, 2016

ఈ సినిమాకు సంగీతం సుపర్ గా అందించి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అసలైన హీరో దేవిశ్రీ ప్రసాద్. తండ్రి, కొడుకుల మధ్య బందాన్ని అందంగా చూపిస్తూ సాగిందీ సినిమా.


ఎన్టీఆర్ మాట్లాడుతూ... సుకుమార్, తాను ఒక మంచి సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నామని, తన 25వ చిత్రం ఇంత మంచి అనుభూతి మిగిల్చినందుకు సంతోషంగా వుందని తెలిపారు. సినిమా హిట్ అయిందా లేదా, ఎంత కలెక్ట్ చేసిందని కాకుండా, వెనక్కితిరిగి చూసుకుంటే ఓ మంచి సినిమా తీశామన్న గర్వం వుండాలని, ఆ కోవకు ఈ చిత్రం చెందుతుందని ఆయన అన్నారు. దేవిశ్రీ తన సంగీతంతో, విజయ్ తన విజువల్స్‌తో ప్రాణం పోశారని, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు ఇచ్చిన సపోర్టు ముఖ్యంగా ఈ చిత్రానికి ప్లస్ అయిందని ఆయన అన్నారు.


 NTR's Heart touching emotion

తాను ఆనందంతో అలిసిపోయి మాటలాడలేని పరిస్థితిలో వున్నానని, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన సాంకేతిక నిపుణులకు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు.


ఈ సినిమా 15 సంవత్సరాల క్రితం వచ్చి వుంటే వృద్ధాశ్రమాలు వచ్చి వుండేవి కావని ఓ కామెంట్‌ను ఈ సినిమా విడుదలయ్యాక తాను విన్నానని, లెక్కలు చెప్పే మాస్టర్ సుకుమార్ కంటే ప్రేక్షకులే పెద్ద ప్రొఫెసర్లు అని, మంచి మార్కులు వేసి హిట్ చేశారని నిర్మాత ప్రసాద్ తెలిపారు.


తక్కువ సినిమాలతో సంతృప్తి కలుగుతుంది అనంటే, తాను ఈ చిత్రంలో నటించినందుకు పూర్తి సంతృప్తిగా వున్నానని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.


ఈ సినిమాలో హీరో, విలన్ల రొమాన్స్ హైలెట్‌గా నిలిచాయని, ఈ సినిమా మొదలుపెట్టినపుడే దర్శకుడు రొమాన్స్ అదిరిపోవాలని చెప్పారని, అదేవిధంగా అదిరిపోయిందని నటుడు జగపతిబాబు తెలిపారు.English summary
NTR, Rakul Preet Singh's ‘Naannaku Prematho’ makers celebrated the film's success today in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu