»   » హాట్ టాపిక్ :నందమూరి తారకరాముడి వెడ్డింగ్ కార్డ్(ఫోటో)

హాట్ టాపిక్ :నందమూరి తారకరాముడి వెడ్డింగ్ కార్డ్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పుడో 1942 లో జరిగిన పెద్ద ఎన్టీఆర్ వివాహ శుభలేక ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో సంచలనం సృష్టిస్తోంది. నందమూరి అభిమానులే కాక ఎన్టీఆర్ అంటే ఆసక్తి ఉన్న ప్రతీ వారు అప్పటి ఆ శుభలేఖను చూడాలని ఆసక్తి చూపించటం విశేషం. ఆ శుభలేఖ ఒకరొకరు షేర్ చేసుకుంటూ ఫేస్ బుక్ అంతటా తిరుగుతోంది. ఎన్టీఆర్ మరోసారి ఈ శుభలేఖ తనేంటో ఏంటో చూపించారు అంటున్నారు అభిమానులు.

ఇక ఆ శుభలేఖ ని కాంట్రగడ్డ చెంచయ్య వేయించినట్లు ఉంది. ఆయన ప్రధమ కుమార్తె బసవ తారకమను, నందమూరు రామయ్య చౌ దరి గారి పుత్రుడు తారక రామారావు కి ఇచ్చి కొమరవోలు గ్రామంలో స్వగృహమందు వివాహం జరప పెద్దలు సుముహూర్తం నిశ్చయించినట్లు వ్రాసి ఉంది.

Ntr's Historical Wedding Card

ఎన్టీఆర్...

జన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం

తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ

చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత

మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్

కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ

కుమార్తెలు : లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి

తొలి చిత్రం : 1949 లో "మనదేశం"

చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్

తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.

ప్రభుత్వ ఆవిర్భావం : 1983 జనవరి 9వ తేది

మరణం :1996 జనవరి 18వ తేది

English summary
N T Rama Rao is a legend who gave a strong identity and respect for Telugus in this country. And anything related to him means historical to us. So, here is one such thing. This is the wedding card of the Nandamuri stalwart. It was on May 2nd, 1942 that NTR and Basava Tarakamma became husband and wife.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu