»   » ఫస్ట్ డే..ఫస్ట్ టాక్ : జనతా గ్యారేజ్ ఎలా ఉంది?సింహాద్రి అయ్యేదే కానీ...

ఫస్ట్ డే..ఫస్ట్ టాక్ : జనతా గ్యారేజ్ ఎలా ఉంది?సింహాద్రి అయ్యేదే కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరస హిట్లతో దూసుకుపోతున్నదర్సకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్. సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కోసం గత కొద్ది నెలలుగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చేసాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 1 అనగా ఈ రోజు రిలీజయింది.

రిలీజ్ సందర్బంగా నిన్న రాత్రి నుంచి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి ఓ రేంజిలో చేశారు. జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లాయి. బెన్‌ఫిట్ షో టికెట్ల కోసం ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర పడిగాపులు కాసి మరీ సొంతం చేసుకుని తమ అభిమాన హీరో సినిమాని చూసేసారు. సినిమా ఎలా ఉంది, ఏం రేంజి హిట్ కావచ్చు అనేది బయిటకు వచ్చింది.


జనతాగ్యారేజ్ చివరి ఇరవై నిముషాలు..అప్ టు ది మార్క్ గా లేదు కానీ, మిగతాదంతా అదరకొట్టారని టాక్. అలాగే క్లైమాక్స్ ని మరింత మాస్ ఓరియెంటెడ్ గా తీర్చిదిద్దితే ఇంకా బాగుండేది అంటున్నారు.


మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

ఎన్టీఆర్, మోహన్ లాల్ ఇద్దరివీ ఇంటెన్స్ క్యారక్టరైజేషన్స్, అవే సినిమాకు కీలకమై నిలిచాయి. క్యారక్టర్స్ లోంచే కథ పుట్టింది.


దేవి నే గిప్ట్

దేవి నే గిప్ట్

ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్, కూల్ సాంగ్స్ హైలెట్స్


కొత్తదనం

కొత్తదనం

కమర్షియల్ ఏంగిల్ లోంచే కొత్త కథని అల్లారు కొరటాల శివ. అలాగే డైలాగులు కూడా పంచ్ లు కోసం ప్రాకులాడకుండా , అర్దవంతంగా రాసారు.


మైనస్

మైనస్

ఈ సినిమాకు పైనే చెప్పుకున్నట్లు అబ్రప్ట్ ఎండింగ్, చివరి ఇరవై నిముషాలు ఇంకా బాగా చేసి ఉంటే ఇంకా బాగుండేది.


కామెడీ లేదు

కామెడీ లేదు

సినిమాలో కామెడీ అనే ఎంటర్టైన్మెంట్ ఏంగిల్ అనేది ఎందుకనో కొరటాల వదిలేసారు. సినిమా సీరియెస్ నెస్ దెబ్బతింటుందని భావించినట్లున్నారు


లేకుంటే సింహాద్రే

లేకుంటే సింహాద్రే

క్లైమాక్స్ కనుక మరింత క్లారిటీతో అబ్రప్ట్ గా లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మరో సింహాద్రి గా ఎన్టీఆర్ కెరీర్ లో నిలిచిపోయేది


ఫ్యాన్స్ ఏమంటారంటే..

ఫ్యాన్స్ ఏమంటారంటే..

బెన్‌ఫిట్ చూసిన ఫ్యాన్స్ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెబుతున్నారు.


ట్రేడ్ లో

ట్రేడ్ లో

రిలీజ్ కు ముందునుంచి ఉన్న పాజిటివ్ బజ్, సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ ...చూస్తూంటే సినిమా కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని ట్రేడ్ లో అంటున్నారు.


ఇద్దరికీ హాట్రిక్

ఇద్దరికీ హాట్రిక్

ఎన్టీఆర్ కు టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత హాట్రిక్, అలాగే మిర్చి, శ్రీమంతుడు చిత్రం తర్వాత కొరటాల శివకు హాట్రిక్ రాబోతోందని చెప్తున్నారు


రేటింగ్

రేటింగ్

ఎన్టీఆర్ అభిమానులైతే సినిమాకు 3.5, 4 రేటింగ్ ఇచ్చేస్తున్నారు. అసలు సిసలు రివ్యూ కావాలంటే మరికొద్దిసేపు ఆగాల్సందే. మరికొద్ది సేపట్లో వన్ ఇండియా తెలుగు వెబ్‌సైట్‌‌లో పూర్తి రివ్యూ చూడవచ్చు.


English summary
Young Tiger Jr NTR’s movie Janatha Garage released big screens worldwide on today (September 1st). Samantha and Nithya Menen playing female lead roles. The film is directed by Koratala Siva and produced by Mythri Movie Makers. Devi Sri Prasad scored the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu