తప్పకుండా చూడాల్సింది :ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ మేకింగ్ వీడియో

By Srikanya

హైదరాబాద్ : ఇప్పుడు ఎన్టీఆర్ అబిమానులు మాత్రమే కాక తెలుగు సిని పరిశ్రమ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై అంచనాలను ఒక రేంజ్‌కి పెంచాయి. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్ర కథ విభిన్నంగా కొరటాల మార్క్‌తో ఉండబోతోందని మెచ్చుకుంటున్నారు.

అంతేకాకుండా కచ్చితంగా కొరటాల గత చిత్రాలవలె బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో చేరిపోతుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆనందపడుతున్నారు. మీరూ ఆ వీడియోని చూడండి.

ఇక 'శ్రీమంతుడు' లో 'ఊరి దత్తత' అనే కాన్సెప్టుతో వచ్చిన కొరటాల శివ ఈ సారి మరో సామాజిక అంశాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. 'జనతా గ్యారేజ్‌'లో మొక్కల పెంపకం, ప్రకృతి గురించి ఎక్కువగా చర్చించినట్టు ట్రైలర్ చూస్తే కనబడుతోంది.

ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం 'హరిత హారం', ఆంధ్రలో 'వనం.. మనం' అంటూ పెద్దస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టారు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పబ్లిసిటీ కూడా కల్పించారు. ఇదే కాన్సెప్టుతో సంబంధమున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌' ఫెరపెక్ట్ టైమింగ్‌తో వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X