»   » గడ్డం ఎందుకు తీసేసానంటే... :ఎన్టీఆర్ (వీడియో)

గడ్డం ఎందుకు తీసేసానంటే... :ఎన్టీఆర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న సక్సెస్ ఫుల్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెషన్ -3 లో 'నాన్నకు ప్రేమతో' ప్రమోషన్స్ కి సంబందించి ఎన్టీఆర్ పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంభందించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తైంది. దాంతో ప్రోమో కట్ చేసి వదిలారు. ఆ ప్రోమోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ముఖ్యంగా ఈ ప్రోమోలో సినిమాలో హైలెట్ గా నిలిచిన గెడ్డం గురించి ప్రశ్నను నాగార్జున వేసారు. ఎన్టీఆర్ గెడ్డం తీసేసి కనపడటం గురించి ఫన్నీగా చెప్పారు. ఆయనేం చెప్పారో ఇక్కడ చూడండి.

#MeeloEvaruKoteeswarudu ... #NTR on hotseat #NannakuPrematho Special ..Coming Very Soon on Maa TV ..Every Fri, Sat & Sun at 9 PM #MEk

Posted by Meelo Evaru Koteeswarudu - Official on 7 January 2016

ఈ పోగ్రామ్ ని సంక్రాంతికి స్పెషల్‌లో చేయాలని ఈ చానల్ భావించిందట. మొదటి సారిగా జూనియర్ ఈ రియాలిటీ షోలో పాల్గొననుండగా, నాగ్ ప్రశ్నలకు జూనియర్ ఏ రేంజ్‌లో సమాధానం ఇస్తారా అని అభిమానులలో ఒకటే చర్చ నడుస్తోంది. అందుకు సమాధానం త్వరలోనే దొరకనుంది.

Ntr's Meelo evaru Koteeswarudu programme promo

మరో ప్రక్క ...సంక్రాంతికి నాగ్, జూనియర్‌లు సోగ్గాడే చిన్ని నాయనా, నాన్నకు ప్రేమతో చిత్రాలతో పొటీ పడుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్దం కాగా, బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు ఇంకెంతటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి మరి అని ఎదురుచూస్తున్నారు అభిమానులు

నాన్నకు ప్రేమతో చిత్రం విడుదల విషయానికి వస్తే..సంక్రాంతికి విడుదల అవుతున్న మిగతా చిత్రాల కన్నా భారీగా ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1700 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి రిలియన్స్ వారు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచారం.

Ntr's Meelo evaru Koteeswarudu programme promo

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
‎MeeloEvaruKoteeswarudu‬ ... ‎NTR‬ on hotseat NannakuPrematho‬ Special ..Coming Very Soon on Maa TV ..Every Fri, Sat & Sun at 9 PM
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu