»   » రివేంజ్ బట్...('నాన్నకు ప్రేమతో' ప్రివ్యూ)

రివేంజ్ బట్...('నాన్నకు ప్రేమతో' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ హీరో ఎన్టీఆర్, క్లాస్ మేకింగ్ డైరక్టర్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ అంటేనే క్రేజ్. దానికి తోడు ఎన్టీఅర్ లుక్ నుంచి, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ దాకా విభిన్నత చూపిస్తూ వస్తున్నారు. దాంతో ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడిపోయింది. సినిమా లవర్స్ కు అయితే ఇక చెప్పక్కర్లేదు..ఎలాగైనా సినిమా చూడాలని ఫిక్సైపోయారు. అంతేనా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి సినిమాని ఎట్టి పరిస్ధితుల్లో మిస్ కాకూడదనే వాతావరణం క్రియేట్ చేసాయి. మరి ఇలా అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎన్టీఆర్ తన 25 సంవత్సరాల కెరీర్ లో కొట్టిన హిట్స్ ని చూపెడుతూ మొదలయ్యే ఈ చిత్రంలో అభిరామ్ గా కనపడతాడు. జాబ్ పోగొట్టుకుని కంపెనీ ఫర్ లాసర్స్ KMC అనే కంపెనీని పెడతాడు. ఆ తర్వాత అనుకోని పరిస్దితుల్లో తన తండ్రి రమేష్ చంద్ర(రాజేంద్రప్రసాద్) గతం తెలుసుకుంటాడు. తర్వాత ఆయన కోసం కృష్ణమూర్తి(జగపతిబాబు)అనే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కు వ్యతిరేకంగా ఓ మిషన్ చేపడతాడు. ఇంతకీ ఆ గతం ఏమిటి... కృష్ణమూర్తిపై విజయం ఎలా సాధించాడు అనే దిసగా మైండ్ గేమ్స్ తో కథ,కథనం నడుస్తుందని సమాచారం.


సుకుమార్ మాట్లాడుతూ...‘‘తండ్రీకొడుకుల బంధం ఎప్పటికీ వన్నె తరగనిది. విశ్వజనీనమైన ఆ బంధాన్ని, దాని వెనక భావోద్వేగాల్ని నాదైన శైలిలో తెరపై చూపించే ప్రయత్నం చేశా. మా నాన్నగారు చనిపోయాక ఆ భావోద్వేగాలు నాలో రెట్టింపయ్యాయి. వాటిని అనుభవిస్తూనే ‘నాన్నకు ప్రేమతో' కథని రాసుకొన్నా. మొదట వేరే కథతో సినిమా చేయాలనుకున్నా. ఇంతలో మా నాన్నగారు చనిపోయారు. ఆ సమయంలో వేరే రకమైన భావోద్వేగంతో కూడిన సినిమా చేయలేననిపించింది. అప్పుడే ఈ కథ ఎన్టీఆర్‌కి వినిపించా. ఇలాంటి కథల్ని వాణిజ్య కోణంలోనే చెప్పాలి. అదే మేం చేశాం. ఈ సినిమాలో తారక్‌ అభిరామ్‌ అనే పాత్రలో కనిపిస్తాడు'' అన్నారు..


Ntr's Nannaku Prematho preview

బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
నటీనటులు: ఎన్టీఆర్‌ , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,
ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి,
ఆర్ట్‌: రవీందర్‌,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌,
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,
పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌,
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌,
సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.
విడుదల తేదీ: 13,జనవరి 2016.

English summary
Nanaku Prematho Is one of The Most Awaited Movie In 2016, And its All Set To Release On 13th January 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu