»   » ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' టీజర్‌ రికార్డ్

ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' టీజర్‌ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్ర టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. టీజర్‌ను ఈనెల 21న విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనికి యూట్యూబ్‌లో 10 లక్షల కన్నా ఎక్కువ హిట్స్‌ వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం విడుదలైన మూడు గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది ఈ టీజర్‌ను వీక్షించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


ఈ టీజర్‌ను వీక్షించిన సినీ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్‌, 'కంచె' చిత్ర దర్శకుడు క్రిష్‌, యువ హీరోలు ఆది, వరుణ్‌ సందేశ్‌, హాస్య నటులు వెన్నెల కిషోర్‌ తదితరులు తారక్‌ సరికొత్తలుక్‌లో అదిరిపోయాడంటూ కితాబులిచ్చారు. ఇంత భారీ స్పందన లభించడం పట్ల చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


ఇక ఈ చిత్రం టీజర్ రెండు రోజుల క్రితం అంటే విడుదల చేసారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.నిర్మాత మాట్లాడుతూ ''తండ్రీ కొడకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తారక్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. సుకుమార్‌ విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి స్పెయిన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. పండగకి ఒక రోజు ముందు విడుదలవుతున్న టీజర్‌ పండగని మరింత సందడిగా మార్చబోతోంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.


టెంపర్ చిత్రం రీసెంట్ గా ఎన్టీఆర్ చిత్రాల్లో 50 కోట్లు వసూలు చేసిన చిత్రం. ఇప్పుడీ చిత్రంలో 60 కోట్లకు టార్గెట్ చేస్తున్నారు. చిత్రం మేజర్ షూటింగ్ ..యూరోపియన్ కంట్రీస్ లో చేస్తున్నారు. చిత్రంలో కథ లండన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.


Ntr's Nannaku Prematho Teaser record

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ చక్రవర్తి, కళ: రవీందర్‌, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, కూర్పు: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌.

English summary
NTR'S Nannaku Prematho Teaser released today as promised by makers. TEASER Smashed all the Tollywood Records in you tube, now completed 12,00,000 Views & 30,000Likes in Fast Track.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu