»   » సూపర్బ్: ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ (వీడియో)

సూపర్బ్: ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం పాటల విడుదల వేడుక హైదరాబాద్‌ నిన్న ఆదివారం రాత్రి జరిగింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ ఆడియో వేడుకకు చిత్ర యూనిట్‌, సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ట్రైలర్ చాలా బాగుందని అంటున్నారు చూసినవారంతా. ఎన్టీఆర్ మరోసారి తన స్కిల్స్ తో మైమరించాడనే చెప్పాలి. అలాగే అతని స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా చాలా కూల్ గా కనిపించటం గమనించవచ్చు.


Ntr's Nannaku Prematho Theatrical Trailer


నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Nannaku Prematho makers have released the theatrical trailer of the film. It is the 25th of N. T. Rama Rao Jr.'s career. The audio launch was held Sunday at Shilpa Kala Vedika in Hyderabad.
Please Wait while comments are loading...