జూ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘రభస’ షురూ...
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం(ఆగస్టు 2) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...'ఎన్టీఆర్ కొత్త స్టైల్ లో కనిపించే ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటర్టెన్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగినట్లుగా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం' అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












