»   » ఎన్టీఆర్ ప్లాఫ్ చిత్రం రీమేక్ కి భారీ .. డిమాండు

ఎన్టీఆర్ ప్లాఫ్ చిత్రం రీమేక్ కి భారీ .. డిమాండు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రిలీజైన మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఎన్‌టిఆర్‌ చిత్రం 'ఊసరవెల్లి'. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వర్కవుట్ కాక భారీ ప్లాఫ్ గా మిగిలిపోయింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు హిందీ రీమేక్‌ హక్కులను ఓ నిర్మాత సొంతం చేసుకున్నారు.

సినిమాలో కంటెంట్‌పరంగా బాగానే ఉన్నా...దానిని డీల్‌ చేసే విషయంలో దర్శకుడు ఫెయిలయ్యాడని,అందుకే ఆ చిత్రం టాలీవుడ్‌లో అంచనాలను అందుకోలేకపోయిందని భావించి ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తీసుకున్నారు.

ఇక ఈ చిత్రం రీమేక్ ని అక్షయ్‌కుమార్‌ హీరోగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ మధ్యన దక్షిణాది చిత్రాలను వెదికి వెదికి పట్టుకుని రీమేక్‌ రైట్స్‌ను పోటాపోటీగా చేజిక్కించుకుంటున్నారు బాలీవుడ్‌ నిర్మాతలు.

అక్కడ హిట్‌ అయిన చిత్రాలన్నీ దక్షిణాదినుంచి దిగుమతి అయినవే కావడం విశేషం. ఊసరవెల్లిని హిందీలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచ మాస్‌ అంశాలున్న సినిమాగా కలెక్షన్ల దుమ్ము దులిపేయడం ఖాయం అని అక్కడ నిర్మాతలు భావిస్తున్నారు. చూద్దాం అక్కడ రిజల్టేమి వస్తుందో.

English summary
Bollywood star Akshay Kumar going to remake the Telugu movie Oosaravelli, starred NTR and Tamanna in the lead roles. The film was directed by Surendar Reddy. Actually, It became a disaster in Tollywood. But, It got good marks from the critics. So, The producers are ready to give the remake rights for 65 Lakhs. The bollywood makers are planned to add some more extra commercial elements to the film.
Please Wait while comments are loading...